‘భోళా శంకర్’ మూవీ రెమ్యునరేషన్ విషయంలో చిరు కీలక నిర్ణయం? ఏం చేశారంటే

By Asianet News  |  First Published Jul 29, 2023, 4:22 PM IST

రెండు వారాల్లో చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. అయితే ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో చిరు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
 


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - మెహర్ రమేశ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భోళా శంకర్’. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులనూ చకాచకా జరుపుకుంటోంది. మరో రెండు వారాల్లో గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కూడా అందిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గా వచ్చిన ‘ట్రైలర్’ కూడా అదిరిపోయింది. మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉంటే.. ‘భోళా శంకర్’ మూవీకి సంబంధించిన రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అంటున్నారు. మేకర్స్ మంచి నెంబర్ నే రెమ్యునరేషన్ గా అందిస్తామన్నా వద్దని చెప్పారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇందుకో ఓ రీజన్ కూడా ఉందని అంటున్నారు. 

Latest Videos

వచ్చే నెలలో పెద్ద సినిమాలేవీ లేవు. దీంతో చిరంజీవి ‘భోళా శంకర్’పైనే అందరి దృష్టి ఉంది. పైగా వరస అప్డేట్స్ తో హైప్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్ మంచి ధరకు అమ్ముడుపోయాయని కూడా అంటున్నారు.  దీంతో బాక్సాఫీస్ వద్ద సినిమా మంచి  కలెక్షన్లు రాబడుతుందని నమ్ముతున్నారు. దీంతో వచ్చే లాభాల్లో చిరుకు పారితోషికం ముట్టజేప్పేందుకు మేకర్స్ సిద్ధమైనట్టు టాక్ నడుస్తోంది. ఇందులో ఎంత నిజమున్నదనేది తెలియాల్సి ఉంది. 

ఇక ‘భోళా శంకర్’ మూవీ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) చిరు సరసన నటిస్తోంది. కీర్తి సురేష్ కీలక పాత్రలో అలరించనుంది. సుశాంత్, రఘబాబు, రవి శంకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. యాంకర్లు శ్రీముఖి, రష్మీ గౌతమ్ కూడా మెరియనున్నారు. అనిల్ సుంకర, కేఎస్ రామారావు నిర్మాతలుగా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్  బ్యానర్ పై మూవీ రూపుదిద్దుకుంటోంది. మహాతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. 

 

click me!