కమల్‌ హాసన్‌కి మెగాస్టార్‌ సాయం.. ?

By Aithagoni Raju  |  First Published Oct 24, 2023, 11:25 AM IST

కమల్ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో `ఇండియన్‌ 2` చిత్రం  రూపొందుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్‌ ఇన్‌వాల్వ్ కాబోతున్నారు. కమల్‌ కి సాయం చేసేందుకు వస్తున్నారట. 


కమల్‌ హాసన్‌.. ఇప్పుడు ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ఆయనకు `విక్రమ్‌` సినిమా ఇచ్చిన సక్సెస్‌ కిక్కు మామూలుది కాదు. ఈ సినిమా మూడువందల యాభై కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. అత్యధిక లాభాలు తెచ్చిన చిత్రంగా నిలిచింది. కలెక్షన్ల పరంగా, ఓటీటీ పరంగా, శాటిలైట్‌ పరంగా డబుల్‌ ప్రాఫిట్‌ను తెచ్చిపెట్టింది. 

ఆ సక్సెస్‌ ఆనందంలో ఇప్పుడు `ఇండియన్‌ 2` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. లైకా ప్రొడక్షన్‌పై సుభాస్కరన్‌, అలాగే ఉదయ్‌నిధి స్టాలిన్‌ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాజల్‌ కథానాయికగా  నటిస్తుంది.  సిద్ధార్థ్‌ మరో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో కమల్‌ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. 

Latest Videos

అనేక కారణాలతో, అడ్డంకులతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. `విక్రమ్‌` సక్సెస్‌తో ఈ సినిమాకి నెలకొన్న సమస్యలన్నీ సాల్వ్ చేసి మళ్లీ పట్టాలెక్కించారు కమల్‌. దీంతో ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. సంక్రాంతి బరిలోకి దిగబోతుంది. ఇటీవలే కమల్‌ డబ్బింగ్‌ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెగాస్టార్‌ ఇన్‌వాల్వ్ అవుతున్నారు. ఆయన తన వంతు సాయం చేయబోతున్నారట. సినిమాకి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారట. కమల్‌ పాత్రకి చిరు నెరేటర్‌గా వ్యవహరిస్తున్నారని సమాచారం. కమల్‌ పాత్రని ఎలివేట్‌ చేసేలా ఈ వాయిస్‌ ఓవర్‌ సాగుతుందట. దానికి చిరంజీవి వాయిస్‌ మరింత ఆకర్షణగా నిలుస్తుందని, ఆడియెన్స్ పై అది బలమై ఇంపాక్ట్ ని చూపిస్తుందని, అందుకే మెగాస్టార్‌తో చెప్పించాలని భావిస్తున్నారట.

ఇప్పటికే చాలా సినిమాలకు చిరంజీవి వాయిస్‌ అందించారు. కథ చెప్పారు. అందులో కొన్ని  హిట్‌,  మరికొన్ని ఫ్లాప్‌ అయ్యాయి. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంతకి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌లో నిజమెంతా అనేది తెలియాల్సి  ఉంది. 
 

click me!