ఆచార్య పేరెత్తి చిరంజీవికి అన్యాయం చేసిన అభిమాని... ట్రోల్స్ షురూ!

By Sambi ReddyFirst Published Sep 29, 2022, 12:36 PM IST
Highlights

చిరంజీవి కెరీర్ లో ఆచార్య ఆల్ టైం డిజాస్టర్ కాగా... ఆ మూవీని ఓ అభిమాని తన ఫేవరెట్ అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ లేడీ ఫ్యాన్ వీడియో వైరల్ అవుతుండగా జనాలు తెగ ట్రోల్ చేస్తున్నారు.

అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో అనంతపురం వేదికగా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. చిరంజీవి అభిమానుల నుండి ఈ ఈవెంట్ కి భారీ ఆదరణ దక్కింది. వేలల్లో ఈవెంట్ కి ఫ్యాన్స్ హాజరయ్యారు. మెగా అభిమానుల కోలాహలం మధ్య గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. చిరంజీవి తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. గాడ్ ఫాదర్ మంచి విజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందు హాజరైన ఫ్యాన్స్ తో యాంకర్ ముచ్చటించారు. 

ఈ క్రమంలో ఆసక్తికర పరిమాణం చోటు చేసుకుంది. ఓ లేడీ ఫ్యాన్ ని యాంకర్... చిరంజీవి చిత్రాల్లో మీకు ఇష్టమైన చిత్రం చెప్పండి? అని అడిగారు. ఆ ప్రశ్నకు సదరు లేడీ ఫ్యాన్ ఆచార్య అంటూ టక్కున సమాధానం చెప్పింది. చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచిన ఆచార్యను  అభిమాని ఇష్టమైన మూవీ అని చెప్పడంతో యాంకర్ కూడా అవాక్కయ్యారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా... యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ షురూ చేశారు. ఆ అభిమాని ఆచార్య మూవీ పేరెత్తి చిరంజీవిని ట్రోల్ చేసిందా? లేక నిజంగానే అభిమానం చూపించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

 ఆచార్య మూవీపై స్వయంగా చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు.ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివపై పలు సందర్భాల్లో ఆయన సెటైర్స్ వేశాడు. అలాంటి చిత్రాన్ని ఫ్యాన్ ఫెవరేట్ మూవీ అని చెప్పడం విశేషంగా మారింది. ట్రోలర్స్ ఆ వీడియోతో పండగ చేసుకుంటున్నారు. ఇక గాడ్ ఫాదర్ మూవీతో చిరంజీవి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఐదు భాషల్లో విడుదల కానుంది. 

. 😂😂 pic.twitter.com/Ia7xrmUctN

— రవి (@R_K_B)

మలయాళ హిట్ మూవీ లూసిఫర్ అధికారిక రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కింది. సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ చేస్తుండగా, నయనతార పవర్ రోల్ లో కనిపించనున్నారు. థమన్ సంగీతం సమకూర్చారు. గాడ్ ఫాదర్ ట్రైలర్ అంచనాలు పెంచేదిగా ఉంది. 

click me!