ఆచార్య టీజర్ డేట్ ఫిక్స్డ్?

Published : Jan 21, 2021, 04:45 PM IST
ఆచార్య టీజర్ డేట్ ఫిక్స్డ్?

సారాంశం

 ఆచార్య మూవీపై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. చిత్ర యూనిట్ ఆచార్య టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్ చేశారట. జనవరి 26న ఆచార్య టీజర్ విడుదల కానుందట. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుందని సమాచారం. 

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఆచార్య షూటింగ్ నిరవధికంగా జరుపుకుంటుంది. కాగా ఆచార్య మూవీపై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. చిత్ర యూనిట్ ఆచార్య టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్ చేశారట. జనవరి 26న ఆచార్య టీజర్ విడుదల కానుందట. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుందని సమాచారం. 

ఇక ఇప్పటికే విడుదలైన ఆచార్య ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ కి విశేష ఆదరణ దక్కింది. దీనితో ఆచార్య టీజర్ ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఆచార్య మూవీలో రామ్ చరణ్ కీలకమైన ఓ రోల్ చేస్తున్నారు. ఆయన సిద్ద అనే కథలో కీలకమైన నిడివి కలిగిన రోల్ చేస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ లో పాల్గొన్నారు. మొదటిసారి చిరంజీవి, చరణ్ పూర్తి స్థాయిలో కలిసి నటించనుండడం విశేషం. 

దేవాలయాలు, వారసత్వ సంపద అనే సామజిక అంశాన్ని తీసుకొని, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొరటాల ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్,  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..