ఘోర ప్రమాదంలో బాలనటుడు దుర్మరణం!

By tirumala ANFirst Published Jul 19, 2019, 9:52 AM IST
Highlights

ఈ మధ్య కాలంలో రోడ్డు యాక్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దారుణమైన ఆ ప్రమాదాల నివారణకు పోలీసులు, ప్రభుత్వాలు ఎన్నో రకాల భద్రతా చర్యలను చేపడుతూ, అమలు చేస్తున్నప్పటికీ.. ప్రయోజనం కనిపించడం లేదు. 

ఈ మధ్య కాలంలో రోడ్డు యాక్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దారుణమైన ఆ ప్రమాదాల నివారణకు పోలీసులు, ప్రభుత్వాలు ఎన్నో రకాల భద్రతా చర్యలను చేపడుతూ, అమలు చేస్తున్నప్పటికీ.. ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో.. ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య పెరుగుతుండటమే కాకుండా ప్రభుత్వాలపై ఆర్థిక భారం కూడా ప్రభుత్వాలపై పడుతోంది. రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారి కుటుంబ సభ్యల వేదనను ఎవరూ తీర్చలేకపోతున్నారు. 
  
తాజాగా రోడ్డు ప్రమాదంలో బాలనటుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఛత్తీస్‌గడ్‌ రాయ్‌పూర్ వద్ద   జరిగిన ఈ ప్రమాదంలో  హిందీ టీవీ సీరియళ్లలో నటించిన పాపులర్ అయిన  శివలేఖ్ సింగ్ ‌(14)  దుర్మరణం పాలయ్యారు.  గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.

రాయ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ ఆరిఫ్ షేక్ అందించిన వివరాల  ప్రకారం ...ఈ ప్రమాదంలో శివలేఖ్ అక్కడికక్కడే మరణించగా,  అతని తల్లి లేఖ్నా సింగ్‌, తండ్రి శివేంద్రసింగ్‌ తోపాటు మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యారు. అయితే తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కారులో బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వైపు వెళుతుండగా వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. యాక్సిడెంట్  తరువాత పారిపోయిన ట్రక్ డ్రైవర్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇక చత్తీస్‌గడ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాకు చెందిన శివలేఖ్ సింగ్  తల్లిదండ్రులతో ముంబైలో నివసిస్తున్నారు. ‘సంకట్‌ మోచన్‌ హనుమాన్‌’, ‘ససురాల్‌ సియర్‌ కా’ లాంటి సీరియల్స్‌తోపాటు అనేక టీవీ రియాల్టీ షోలలో  శివలేఖ్‌ కనిపించారు.  

click me!