చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్!

Published : Sep 01, 2018, 05:37 PM ISTUpdated : Sep 09, 2018, 01:49 PM IST
చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్!

సారాంశం

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే సావిత్రి జీవితంతో తెరకెక్కించిన 'మహానటి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే సావిత్రి జీవితంతో తెరకెక్కించిన 'మహానటి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఇక 'ఎన్టీఆర్', 'వైఎస్సార్'ల బయోపిక్ లు సెట్స్ పై ఉన్నాయి. తాజాగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్ ను కూడా చిత్రీకరిస్తున్నారు.

పి.వెంకటరమణ అనే దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తుండగా.. రాజేంద్ర సినిమాను నిర్మిస్తున్నారు. 'చంద్రోదయం' పేరుతో బయోపిక్ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. టైటిల్, చంద్రబాబు ఫొటోతో సింపుల్ గా ఫస్ట్ లుక్ దర్శనమిస్తోంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ ఎనభై శాతం పూర్తయినట్లు వినోద్ నువ్వుల.. చంద్రబాబు పాత్ర పోషించబోతున్నారని దర్శకుడు వెల్లడించారు. చంద్రబాబు చిన్నతనం నుండి రాజకీయనాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారం. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల కానుంది. 
 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?