మొన్న మహేష్ నేడు చిరు...టాలీవుడ్ స్టార్స్ పై బాబు ప్రేమ..!

By Satish ReddyFirst Published Aug 22, 2020, 3:07 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నేడు తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీనితో సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చిరంజీవికి బెస్ట్ విషెష్ చెప్పడం విశేషంగా మారింది. 
 

నేడు మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ వేడుకలలో తలమునకలై ఉన్నారు. చిరు తన జీవితంలో ప్రముఖమైన 65వ పుట్టినరోజు నేడు జరుపుకుంటున్నారు. కరోనా వైరస్ లేని పక్షంలో చిరంజీవి ఈ వేడుకను చిత్ర ప్రముఖులు మరియు బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకోవాలనుకున్నారు. కరోనా కారణంగా అది కుదరలేదు. ఐతే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందివారితో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు పుట్టినరోజు  శుభాకాంక్షలు చెవుతున్నారు. 

కాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చిరంజీవికి బెస్ట్ విషెష్ చెప్పారు. ఆయన ట్విట్టర్ వేదికగా చిరుని విష్ చేయడం జరింగింది. 'అంచలంచెలుగా ఎదుగుతూ సినీ అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని, సినీ రంగంలో చిరకీర్తిని సంపాదించుకున్న శ్రమజీవి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ స్వయం కృషి, సేవాభావం యువతకు ఆదర్శం. మీరు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను' అనిట్వీట్ చేశారు. 

అంచెలంచెలుగా ఎదుగుతూ, సినీ అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని, సినీరంగంలో చిరకీర్తినీ సంపాదించుకున్న శ్రమజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ స్వయంకృషి, సామాజిక సేవాస్ఫూర్తి యువతకు ఆదర్శం. మీరు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను pic.twitter.com/bMSRxmZU1V

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn)

ఈనెల 9న మహేష్ పుట్టిన రోజు నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ ని కూడా చంద్రబాబు నాయుడు విష్ చేయడం జరిగింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ కి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు చెవుతూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఐతే మహేష్, చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు మే 20న ఎన్టీఆర్ కి బర్త్ డే విషెష్ చెప్పలేదు. ఈ విషయంలో చంద్రబాబు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. వరసకు అల్లుడైన ఎన్టీఆర్ కి బర్త్ డే విషెష్ చెప్పని బాబు, మహేష్ కి బర్త్ డే విషెష్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు బాబును నిలదీశారు. 

click me!