హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై ఛీటింగ్‌ కేసు..

Published : Mar 11, 2022, 03:40 PM IST
హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై ఛీటింగ్‌ కేసు..

సారాంశం

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌లపై కేసు నమోదైంది. బంజారాహిల్స్ లో ఛాటింగ్‌ కేసు పెట్టారు.

టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌(Bellamkonda Srinivas), ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌(Bellamkonda Suresh)లపై ఛీటింగ్‌ కేసు నమోదైంది. వీఎస్‌ శ్రవణ్‌ కుమార్‌ అనే ఫైనాన్షియర్‌ శుక్రవారం హీరో, నిర్మాతపై బంజరాహిల్స్ లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదనే ఆరోపణలో ఆయన ఈ కేసు పెట్టారు. శ్రవణ్‌ కుమార్‌ ఫిర్యాదు ప్రకారం. బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ తన దగ్గర నుంచి రూ.85లక్షలు అప్పుగా తీసుకున్నారని, 2018, 19 మధ్యలో ఓ సినిమా ప్రొడక్షన్‌ కోసం ఈ మొత్తం డబ్బుని తీసుకున్నారని తెలిపారు. చాలా మంది టెక్నీషియన్లకి తన అకౌంట్‌ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేశారని శ్రవణ్‌ వెల్లడించారు.

ఈ మొత్తం తిరిగి ఇవ్వాలని అడగ్గా బెల్లంకొండ సురేష్‌, శ్రీనివాస్‌ ఇద్దరూ సరిగా స్పందించడం లేదని, పైగా తనపై బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపారు. తనని సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తానని చెప్పి డబ్బు తీసుకుని ఇప్పుడు మోసం చేశారని ఆరోపిస్తూ శ్రవణ్‌ తన ఫిర్యాదులో వెల్లడించారు. శ్రవణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ జరుగుతున్నామన్నారు. 

అయితే ఈ కేసుపై నిర్మాత బెల్లంకొండ సురేష్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించాల్సి ఉంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల `అదుర్స్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ లో 'ఛత్రపతి' రీమేక్ లో నటిస్తున్నారు. అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. పాన్‌ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించబోతున్నారు. ఓ స్టార్‌ డైరెక్టర్‌ ఈచిత్రానికి వర్క్ చేయబోతున్నారని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్