
దర్శకుడు వర్మ(Ram Gopal Varma)కు టాలీవుడ్ లో ఒక గ్యాంగ్ ఉంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఆయన శిష్యుడే. వర్మ గ్యాంగ్ లో సభ్యులు కూడాను. వర్మ అంత కాకపోయినా పూరి సైతం తన సీక్రెట్ లైఫ్ గురించి ఓపెన్ గానే చెబుతాడు. నచ్చిన పని దర్శకత్వం చేస్తూనే... లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పార్టీలు, విహారాలు అంటే మహా పిచ్చి. పూరికి తోడు ఛార్మి తోడైంది. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అవుతున్న దశలో తెలివిగా పూరి పక్కన చేరింది. నమ్మి వచ్చిన ఛార్మీని వదలకుండా తన ప్రయాణంలో తోడుగా ఉంచుకున్నాడు పూరి.
హీరోయిన్ గా సంపాదించిన సొమ్మును పూరి (Puri Jagannadh)చేతిలో పెట్టి నిర్మాతగా మారింది ఛార్మి. పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థలో ఆమె కూడా భాగస్వామి. అయితే ఈ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రాలన్నీ వరుస ప్లాప్స్ . దీనితో పూరి, ఛార్మి ఆర్థిక బాధల్లో కూరుకుపోయారు. అయినా నమ్మిన సినిమాను వదలకుండా అనేక బాధలు పడి ఇస్మార్ట్ శంకర్ మూవీ తెరకెక్కించారు. ఆ మూవీ భారీ విజయం సాధించడంతో పూరి, ఛార్మి పోగొట్టుకున్నవన్నీ రాబట్టుకున్నారు.
ఇక ఎప్పటిలాగే వాళ్ళ సరదాలు రెట్టింపు చేశారు. ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఛార్మి, వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పూరితో వర్మకు ఉన్న అనుబంధం రీత్యా తరచుగా వీరు కలుస్తూ ఉంటారు. తాజాగా వర్మతో కలిసి ఛార్మి (Charmi)మందు కొట్టారు. వర్మ తన పెగ్ తానేదో ఎంజాయ్ చేయకుండా ఛార్మి పెగ్గేస్తున్న ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వెరికోరికైతే ఇది పెద్ద విషయం. ఛార్మి మాత్రం చాలా లైట్ గా తీసుకుంది. జస్ట్ హా హా హా అంటూ నవ్వేసింది.
ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ఛార్మి పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సహ నిర్మాతగా ఉన్న ఈ మూవీ భారీ ఎత్తున తెరకెక్కుతుంది. లైగర్ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.