కెప్టెన్‌ అయ్యాక రెచ్చిపోయిన అవినాష్‌.. సభ్యులకు ఫనిష్‌మెంట్స్

Published : Oct 22, 2020, 11:02 PM IST
కెప్టెన్‌ అయ్యాక రెచ్చిపోయిన అవినాష్‌.. సభ్యులకు ఫనిష్‌మెంట్స్

సారాంశం

కెప్టెన్‌ అయ్యాక కూడా ఊహించని విధంగా తన నిర్ణయాలు ప్రకటించిన సభ్యులను షాక్‌కి గురి చేశాడు అవినాష్‌. తాను కెప్టెన్‌గా ఉన్నంత వరకు ఎవరైనా మిస్టేక్స్ చేస్తే ఫనిష్‌మెంట్స్  ఉంటాయని ముందే కండీషన్స్ పెట్టాడు. 

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో అవినాష్‌ రెచ్చిపోయాడు. ఆరుగురు ప్యాసింజర్లని తన స్టేషన్‌కి చేర్చి కెప్టెన్‌ అయ్యాడు. ఆయన చేతిలో ఓడిపోయిన అరియానాని ఖుషీ చేస్తూ, ఇంటిసభ్యుల మన్ననలు పొందేలా రేషన్‌ మేనేజర్‌గా అరియానాని ఎంపిక చేశాడు. అయితే ఈ గేమ్‌ సాగే విషయంలో అవినాష్‌ చాలా సీరియస్‌ అయ్యాడు. ఎవరి గేమ్‌ వారు ఆడాలని, అటూ ఇటూ ఉండకూడదని ఇంటిసభ్యులపై ఫైర్‌ అయ్యాడు. 

ఇక కెప్టెన్‌ అయ్యాక కూడా ఊహించని విధంగా తన నిర్ణయాలు ప్రకటించిన సభ్యులను షాక్‌కి గురి చేశాడు అవినాష్‌. తాను కెప్టెన్‌గా ఉన్నంత వరకు ఎవరైనా మిస్టేక్స్ చేస్తే ఫనిష్‌మెంట్స్  ఉంటాయని ముందే కండీషన్స్ పెట్టాడు. అందులో భాగంగా ఈ వారంలో ఎవరైన మైక్‌ మర్చిపోతే వందసార్లు ఆ మైక్‌లో ఇక మైక్‌ మర్చిపోను అని వందసార్లు చెప్పాలన్నారు.  మధ్యలో నిద్రపోతే రెండు సార్టు స్విమ్మింగ్‌ ఫూల్‌లో దూకాలనే కండీషన్‌ పెట్టాడు. 

అంతటితో ఆగలేదు. ఈ వారం ఎవరైనా ఇంగ్లీష్‌లో మాట్లాడితే, చిన్న పిల్లాడిలా ప్రతి కెమెరా ముందుకు వెళ్ళి ఇక ఇంగ్లీష్‌లో మాట్లాడనని చెప్పాల్సి ఉంటుందని చెప్పాడు. ఇన్ని కండీషన్స్ పెట్టడంతో సభ్యులు షాక్‌కి గురయ్యారు. ఈ కండీషన్స్, ఫనిష్‌మెంట్స్ తనకి కూడా వర్తిస్థాయని పేర్కొన్నాడు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌