మానవ నాయక్ క్యాబ్ డ్రైవర్ తనను ఎంతగా భయాందోళనకు గురి చేశాడో సోషల్ మీడియాలో వివరించారు. ఆమె మాట్లాడుతూ... శనివారం రాత్రి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుండి ఇంటికి వెళ్లేందుకు నేను క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్ లో ఎక్కినప్పటి నుండి డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దని నేను అభ్యంతరం తెలిపాను. అయినా నా మాట పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి సిగ్నల్ జంప్ చేశాడు.
పోలీసులు క్యాబ్ ఫోటో తీశారు. దాంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఫోటో తీశారు కదా క్యాబ్ ని విదిలేయండని నేను రిక్వెస్ట్ చేయంతో పోలీసులు వదిలిపెట్టారు. పోలీసులు వేసిన రూ. 500 ఫైన్ నువ్వు కడతావా? అంటూ నాతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో కారు పోలీస్ స్టేషన్ కి పోనిమ్మని నేను కోరాను. అనంతరం ఒక చీకటి ప్రదేశంలో కారు ఆపాడు. తర్వాత కారు స్టార్ట్ చేసి వేగంగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేశాడు.. దాంతో నాకు కేకలు వేశాను. ఇద్దరు బైకర్స్, ఒక ఆటో రిక్షా కారును అడ్డగించి నన్ను కాపాడారు. నేను క్షేమంగానే ఉన్నాను, అని మానవ నాయక్ తన భయానక అనుభవాన్ని వెల్లడించారు.
మానవ నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. డ్రైవర్ తన అనూహ్య ప్రవర్తనతో మానవ సింగ్ ని భయపెట్టాడు. ఒకవేళ కారు అడ్డగించి ఆమెను కాపాడకపోతే ఎంత ప్రమాదం జరిగేదో అని భావిస్తున్నారు. ఇలాంటి క్యాబ్ డ్రైవర్స్ కి బుద్ధి చెప్పాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.