
కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న రన్బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. పెళ్ళైన రెండు నెలలకే అలియా తాను గర్భవతినయ్యానని ప్రకటించారు. అంత తక్కువ సమయంలో అలియా ప్రెగ్నెంట్ కావడం విశేషంగా మారింది. ఈ వార్తను మీడియా ప్రముఖంగా ప్రచురించింది. నవంబర్ 6న అలియా ఆడపిల్లకు జన్మను ఇవ్వడం జరిగింది. ఇక తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.
అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అలాగే భర్త రన్బీర్ కపూర్ కి జంటగా తెరకెక్కిన బ్రహ్మాస్త్రం తెలుగులో కూడా విడుదలైంది. ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ ప్రేయసి సీత పాత్రలో అలియా కనిపించారు. ఆ విధంగా అలియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో అలియా పాత్రకు పెద్దగా స్పేస్ లేదు. అయితే ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. ఎన్టీఆర్- -30కి సైన్ చేసిన అలియా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు.
అలియా-రన్బీర్ దగ్గర కావడానికి బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కారణం. ఈ చిత్రం కోసం కలుసుకున్న అలియా, రన్బీర్ ప్రేమికులయ్యారు. రెండేళ్ల క్రితం రిలేషన్ ప్రకటించిన రన్బీర్-అలియా సన్నిహితంగా ఉంటున్నారు. పెళ్ళికి ముందే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. చదువుకునే రోజుల్లో రన్బీర్ తన క్రష్ అంటూ అలియా చెప్పారు. ఇక రన్బీర్ ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకొనె తో పాటు పలువురు హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపినట్లు కథనాలు వెలువడ్డాయి.