అలా ఉన్నాకాబట్టే... 23 మంది ఆడపిల్లలకు పెళ్లి చేసా

By Surya PrakashFirst Published Apr 27, 2020, 4:58 PM IST
Highlights

ఈ గ్లోబు అంద‌రిదీ. అంద‌రికీ స‌మాన హ‌క్కులున్నాయి. దేవుడు ఇచ్చిందే ఇంకొక‌డికి ఇస్తున్నాం. అందులో గొప్ప‌ద‌నం ఏమీ లేదు. దానం చేస్తే ఆ సంగ‌తి ఎవరికీ తెలీయ‌కూడ‌దు, ప‌బ్లిసిటీలెందుకు?  ఇలాంటి విష‌యాలు నేనెప్పుడూ చెప్పుకోను’’ అని బ్రహ్మీ వెల్లడించారు. 

ఇండస్ట్రీలో టాప్ కమిడియన్ గా ఎదిగిన బ్రహ్మానందానికి నటనలో వంకపెట్టేవాళ్లు లేరు. అయితే ఆయన వర్కింగ్ కల్చర్ పైనే చాలా విమర్శలు ఉన్నాయి. చిన్నవాళ్లను లెక్క చేయరని, డబ్బు విషయంలో చాలా పట్టుబడతారని, షూటింగ్ సమయంలో కొత్త డైరక్టర్స్ ని వేపుకు తింటారని..ఇలా రకరకాల గా చెప్పుకుంటారు. అయితే అందులో కొంత నిజం ఉండచ్చు..మరికొంత కల్పన ఉండచ్చు. అయితే ఆ విషయమై ఆయన్ని ప్రశ్నించేవారు మాత్రం లేరు అన్నది నిజం. అంతెందుకు ఆయన కరోనా సహాయ చర్యలకు ఇచ్చిన డొనేషన్ సైతం అందరూ విమర్శించటం జరిగింది. ఈ విషయం ఓ మీడియా ఛానెల్ దగ్గర ఆయన ఓపెన్ అయ్యారు.     

బ్రహ్మానందం మాట్లాడుతూ... ‘‘చిత్రపరిశ్రమలో నేను చాలా మంది నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకోలేదు కానీ ఏం నేర్చుకోకూడదో తెలుసుకున్నాను. డబ్బుని నెగ్లెట్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు..వాళ్లను చూసాను.. ఒకవేళ డబ్బు విషయంలో నేను గట్టిగా లేనని అనుకుంటే రోజుకి వంద రూపాయిలు ఇచ్చేవాడు.. పది రూపాయలే ఇస్తానంటే నా జీవితం ఏంటి? దీన్ని నేను డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వడం అని అంటాను.అలా డబ్బుకు రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టే 23 మంది ఆడపిల్లలకు నా చేతులతో పెళ్లి చేయించగలిగానని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. నేను ఆ ఆడపిల్లలకు పెళ్లి చేయకపోతేవాళ్ల జీవితాలు ఏమయ్యేవి? ఆ బాధ్యతతోనే నేను వాళ్లకు పెళ్లి చేశాను. ఇవన్నీ నేను చెప్పుకోవాల్సిన విషయాలు కాదని బ్రహ్మానందం వెల్లడించారు.
 
అలాగే ఈ గ్లోబు అంద‌రిదీ. అంద‌రికీ స‌మాన హ‌క్కులున్నాయి. దేవుడు ఇచ్చిందే ఇంకొక‌డికి ఇస్తున్నాం. అందులో గొప్ప‌ద‌నం ఏమీ లేదు. దానం చేస్తే ఆ సంగ‌తి ఎవరికీ తెలీయ‌కూడ‌దు, ప‌బ్లిసిటీలెందుకు?  ఇలాంటి విష‌యాలు నేనెప్పుడూ చెప్పుకోను’’ అని బ్రహ్మీ వెల్లడించారు. 

సాధారణ తెలుగు లెక్చరర్‌గా జీవితం మొదలెట్టిన ఆయన జధ్యాల గారి సాయింతో సినీ రంగంలోకి అడుగుపెట్టి.. అనతి కాలంలో ప్రముఖ కమెడియన్‌గా ఎదిగారు బ్రహ్మానందం. రెండు మూడు సంవత్సరాల  క్రితం వరకూ బ్రహ్మి లేని సినిమాలను ఊహించలేం. ఒకరకంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఆయన ఎదిగారు. అయితే వయస్సు మీద పడటం, యంగ్ కమిడియన్స్ రావటంతో ఆయన వెనకబడ్డారు. 
 

click me!