యంగ్ హీరోలతో బోయపాటి ప్రయోగం.. మాస్ మల్టీస్టారర్!

Siva Kodati |  
Published : May 22, 2019, 03:04 PM ISTUpdated : May 22, 2019, 03:05 PM IST
యంగ్ హీరోలతో బోయపాటి ప్రయోగం.. మాస్ మల్టీస్టారర్!

సారాంశం

ఎన్నికలు ముగియగానే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం అవుతుందని అంతా భావించారు. కానీ బాలయ్య బోయపాటికి హ్యాండిచ్చి సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తో ఓ చిత్రాన్ని చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. గత ఏడాది కె ఎస్ రవికుమార్, బాలయ్య కాంబినేషన్ లో జైసింహా తెరకెక్కింది.

ఎన్నికలు ముగియగానే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం అవుతుందని అంతా భావించారు. కానీ బాలయ్య బోయపాటికి హ్యాండిచ్చి సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తో ఓ చిత్రాన్ని చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. గత ఏడాది కె ఎస్ రవికుమార్, బాలయ్య కాంబినేషన్ లో జైసింహా తెరకెక్కింది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై కమర్షియల్ గా సక్సెస్ అయింది. కానీ  నందమూరి అభిమానులకు మాత్రం నిరాశే. 

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రంపై ఫ్యాన్స్ ఎన్నో అసలు పెట్టుకుని ఉన్నారు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా బాలయ్య నిర్ణయం తర్వాత బోయపాటి అఖిల్, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ లాంటి హీరోలతో సినిమా చేయాలనీ ప్రయత్నించాడు. అది కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. కార్తికేయ కూడా బిజీగా ఉన్నాడు. 

ఇదిలా ఉండగా బోయపాటి వద్దకు మరో ప్రతిపాదన వచ్చిందట. ఓ రచయిత అద్భుతమైన మల్టీస్టారర్ కథని బోయపాటికి అందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు బోయపాటి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ,మాస్ ప్రేక్షకులని మెప్పించే అంశాలు పుష్కలంగా ఉన్న ఈ కథని ఇద్దరు యంగ్ హీరోలతో చేయాలని బోయపాటి భావిస్తున్నట్లు టాక్. ఆ ఇద్దరు యంగ్ హీరోలు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?