బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్న "ఖైదీ"

Published : Jan 11, 2017, 07:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్న "ఖైదీ"

సారాంశం

అభిమానులను మెప్పించిన మెగాస్టార్ రీ ఎంట్రీలో బాస్ ఈజ్ బ్యాక్ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగా మూవీ ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ల రికార్డులు కొల్లగొట్టడం ఖాయం

మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదిన్నరేళ్ల గ్యాప్ తర్వాత నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా బుధవారం విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకుని ఇటు ఫ్యాన్స్ నే కాక సినీ లవర్స్ ను కూడా అలరిస్తోంది. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చేసిన సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ‘ఖైదీ నంబర్‌ 150 సూపర్‌ హిట్ అమ్మా.. బాస్‌ ఈస్‌ బాక్ ట్యాగ్ లైనుకు మెగాస్టార్ పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్, డాన్స్, టైమింగ్, ఎగ్జిక్యూషన్ కుదిరాయి. మెగాఫ్యాన్స్ కు సంక్రాంతి మొదలయింద’ని ఓ అభిమాని చేసిన ట్వీట్ ను మ్యూజిక్ డైరెక్టర్‌ ఎస్ఎస్ తమన్ రీట్వీట్ చేశాడు. ఇండస్ట్రీ పర్సనాలిటీసే ఇలా బాస్ రీ ఎంట్రీని సెలిబ్రేట్ చేసుకుంటుంటే ఇక మిగతావారి సంగతి ప్రత్యేకంగా చెప్పాలా..

 

ఖైదీ నంబర్‌ 150 పెద్ద హిట్ కాబోతుందని పేర్కొంటూ హీరోయిన్ కాజల్ ధియేటర్‌ లో అభిమానుల సందడి ఫొటో పెట్టింది. అమెరికాలో ప్రీమియర్‌ షోలు పూర్తి కాకుండానే మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయని సమాచారాన్ని దర్శకుడు హరీష్‌ శంకర్, కమెడియన్ వెన్నెల కిశోర్‌ రీట్వీట్‌ చేశారు. ప్రీమియర్ షో గ్రాస్ కలెక్షన్లలో ‘బాహుబలి’ ని అధిగమించే దిశగా ‘ఖైదీ’  పయనిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి 150వ చిత్రం రూ.100 కోట్లు మించి వసూళ్ల సాధిస్తుందని అభిమానులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar 2 Collection: 500 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తున్న ధురంధర్ 2, సునామీ సృష్టిస్తున్న రణవీర్ సినిమా..
ఏఎన్నార్ కూతురిగా శ్రీదేవి, నాస్తికుడైన అక్కినేని పరమ భక్తుడిగా నటించిన సినిమా, భక్త తుకారాం మూవీ రివ్యూ..