సౌత్ లోకి మరో బాలీవుడ్ హిట్ సినిమా!

Published : Mar 19, 2019, 04:36 PM IST
సౌత్ లోకి మరో బాలీవుడ్ హిట్ సినిమా!

సారాంశం

సౌత్ లో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేయడం, బాలీవుడ్ హిట్ సినిమాల రైట్స్ తీసుకొని సౌత్ లో రీమేక్ చేయడం జరుగుతూనే ఉంది. 

సౌత్ లో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేయడం, బాలీవుడ్ హిట్ సినిమాల రైట్స్ తీసుకొని సౌత్ లో రీమేక్ చేయడం జరుగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాల హవా మరింత ఎక్కువైంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో హిట్ అయిన క్వీన్, పింక్ సినిమాలను సౌత్ లో రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టు లోకి మరో సినిమా చేరింది. గతేడాది బాలీవుడ్ సంచలన విజయం నమోదు చేసిన 'బదాయి హో' సినిమాను ఇప్పుడు దక్షిణాది భాషల్లో రీమేక్ చేయాలనుకుంటున్నారు.

చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమా సౌత్ రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడు నిర్మాత బోనీకపూర్. ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. అమిత్ షా డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి!

 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌