‘టైగర్ నాగేశ్వర రావు’, ‘గణపథ్’ రిలీజ్.. అక్కాచెల్లెళ్ల మధ్య పోటీ.!

Published : Oct 20, 2023, 11:44 AM IST
‘టైగర్ నాగేశ్వర రావు’, ‘గణపథ్’ రిలీజ్.. అక్కాచెల్లెళ్ల మధ్య పోటీ.!

సారాంశం

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి సనన్, నుపూర్ సనన్ నటించిన చిత్రాలు ఓకేరోజు ఇవ్వాళే విడుదలటం విశేషం. రెండు పాన్ ఇండియా సినిమాలే కావడంతో అక్కాచెల్లెళ్ల మధ్య గట్టి పోటి ఉండనుంది. ఆ చిత్రాలపై మరింత ఆసక్తి నెలకొంది.  

‘వన్ నెనొక్కడినే’, ‘ఆదిపురుష్’ చిత్రాలతో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)  తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. హిందీతో పాటు సౌత్ ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం చెల్లి నుపూర్ సనన్ (Nupur Sanon)  టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తన తొలిచిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా `టైగర్‌ నాగేశ్వరరావు` (Tiger Nageswara Rao) చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు ఈరోజే (అక్టోబర్ 20)న వచ్చింది. దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరోయిన్ గా నుపుర్‌ సనన్‌ నటించింది. హీరోయిన్ గా తనకు తొలిచిత్రం. ఈ మూవీలో రేణు దేశాయ్‌ కీలక పాత్రలో నటిస్తోంది. 

ఇక నుపూర్ సనన్ అక్క కృతిసనన్  ‘వార్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న బాలీవుడ్ యంగ్ అండ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన నటించింది. ‘గణపథ్’ (Ganapath) అనే యాక్షన్ ఫిల్మ్ తో కృతిసనన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కూడా ఈరోజే గ్రాండ్ గా విడుదలైంది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదలైంది. 

అయితే, అక్కా చెల్లెళ్లు అయిన కృతిసనన్, నుపూర్ సనన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడటం ఇండస్ట్రీ వర్గాలో ఆసక్తికరంగా మారింది. అటు గణపథ్, ఇటు టైగర్ నాగేశ్వరరావు రెండూ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవడంతో మంచి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు రెండు సినిమాలకూ మంచి టాకే దక్కింది. పూర్తిస్థాయిలో రిజల్ట్ ఎలా ఉంటుందనేని ఆసక్తికరంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి