
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో గతేడాది రిలీజ్ అయిన ‘పుష్ప’లో అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప రాజ్ గా ఇండియా మొత్తంగా ఆడియెన్స్ ను ఊర్రూతలూగించాడు. సినిమా రిలీజ్ అయి నాలుగు నెలలు దాటినా ఇంకా పుష్ప రాజ్ మేనరిజం కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ పుష్ప డైలాగ్స్ వినపడుతూనే ఉన్నాయి. సాంగ్స్ మోగుతూనే ఉన్నాయి. ‘పుష్ప : ది రైజ్’ చిత్రంతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని జాతీయ ప్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బన్నీ మేకోవర్, పెర్ఫార్మెన్స్, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, రష్మికా మందన్న (Rashmika Mandanna) గ్లామర్ అపీరెన్స్, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కలగలిసి చిత్రాన్ని టాప్‌లో నిలబెట్టాయి.
అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ రాబట్టి.. బన్నీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. మొదటి భాగం తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ కారణంగా రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్టవడానికి ఏఏ అంశాలు దోహదం చేశాయో.. రెండో భాగంలో అంతకు మించిన స్థాయిలో అభిమానులకు సర్ ప్రైజులు సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు సకుమార్. ఈ క్రమంలో రెండో భాగంలో ఒక కీలకపాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోని రంగంలోకి దింపుతున్నాడట.
ఆయనెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి (Sunil Shetty) అంటూ ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule)లో సీనియర్ పోలీసాఫీసర్ పాత్రలో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే మొదటి భాగంలో పోలీసు పాత్రను ఫాహద్ ఫసిల్ (Fahad Fasil) పోషించారు. అయిత ఫాహద్ పై ఆఫీసర్ పాత్రలో సునిల్ శెట్టి కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర సినిమాకి చాలా కీలకంగనూ ఉండనుందట.
భన్వర్ సింగ్ షెకావత్ పాత్రధారి ఫహద్ ఫాజిల్‌కు ఆయన బాస్‌గా నటిస్తున్నట్టు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌కే కింగ్ గా ఎదిగిన ‘పుష్పరాజ్’ కు అడుగడుగునా భన్వర్ సింగ్ అడ్డుతగిలితే.. సునీల్ శెట్టి పుష్పని సేవ్ చేసేందుకు ప్రయత్నిస్తాడట. అలాగే ప్రీక్లైమాక్స్ లో సునీల్ శెట్టి ఇచ్చే ట్విస్ట్ సినిమాకే హైలైట్ గా నిలిచిపోతుందని టాక్. తెలుగులో సునీల్ శెట్టి ట్రాక్ రికార్డ్ ఏమంత బాలేదు. ఇటీవల ‘గని’, అంతకు ముందు మంచు విష్ణు ‘మోసగాళ్లు’ చిత్రాల్లో నటించారు. ఆ సినిమాలు అంతగా ఆడలేదు. అలాగే.. రజినీకాంత్ ‘దర్బార్’ లోనూ శెట్టి విలన్ గా నటించిన పెద్దగా నిలవలేకపోయాడు. ఈ సినిమాతో సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంటాడని పలువురు ఆశిస్తున్నారు.