న్యూ లుక్స్ తో బాలీవుడ్ మొత్తానికి షాక్ ఇచ్చింది హీరోయిన్ సారా అలీఖాన్. గతంలో ఎలా ఉంది... ఇప్పుడు ఎలా ఉంది అంటూ.. నెటిజన్లు తెగ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. స్టార్ హీరోయిన్లు కూడా షాక్ అవుతున్నారు.
చాలా అంటే చాలా తక్కువ టైమ్ లో వెయిట్ తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్. రెండంటే రెండే వారాలల్లో ఆమెలో మార్పు చూసి అంతా అవాక్ అవుతున్నారు. బెల్లీ ఫ్యాట్ తో తీవ్రమైన ఇబ్బందులకు గురయిన సారా అలీ ఖాన్.... తాజాగా తన ఫ్యాట్ ను కరిగించేసింది. ప్రస్తుతం సారా అలీ ఖాన్ స్లిమ్ లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నార.. సెలబ్రిటీలు షాక్ అవుతున్నారు.
సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్.. దివంగత హీరో.. సుశాంత్ సింగ్ జోడీగా కేదార్నాథ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది. సారా చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. కాగా ఇప్పుడు లీన్ గా నాజూకు సొగసుతో కనిపించే సారా.. సినిమాల్లోకి రాకముందు చాలా లావుగా కనిపించేది.
అప్పట్లో సారా లుక్ చూస్తే.. అంతా షాక్ అవుతారు. అంత లావుగా.. బెల్లీ ఫ్యాట్ తో ఉండేది. ప్రస్తుతం ఉన్న ఫోటోకి.. అప్పుడు ఉన్నఫోటోకు చాలా తేడా గమనించవచ్చు. సారా ఆలీఖాన్.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని దక్కించుకుంది.. క్రేజీ హీరోయిన్ గా మారింది. . సారా ఈ మధ్య ఓ భిన్నమైన ఫొటోను తన ఇస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో తనదే. యోగా మ్యాట్‌పై కూర్చుని బెల్లీ ఫ్యాట్‌ని చూపిస్తూ తాను దిగిన ఫొటో అది. ఆ ఫోటోని షేర్ చేసి... ఈ విషయంలో నేను నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నారు.
రీసెంట్ ఈవెంట్స్‌లో నా శరీర బరువు నన్ను చాలా ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా నా బెల్లీ ఫ్యాట్. అది నాకు పెద్ద మైనస్. అందుకే దానిపై యుద్ధం ప్రకటించా’ అంటూ వెంటనే మరో ఫొటో షేర్ చేసింది. తను బెల్లీ ఫ్యాట్‌ని కరిగించి స్లిమ్ అయిన ఫొటో అది. రెండు వారాల్లో ఇంత మార్పా? అంటూ నెటిజన్స్ ఆ ఫొటోలు చూసి షాక్‌కి గురవుతున్నారు.
అయితే ఆమె ఈమధ్య ఎక్కువగా వర్కౌట్ వీడియోస్ ను పోస్ట్ చేయడం తెలిసిందే. ఆ వీడియోస్ లో తెగ కష్టపడింది బ్యూటీ. అనుకున్నది సాధించి చూపించింది. పట్టుదలతో వర్కౌట్స్ చేస్తూ.. తనను తాను మలుచుకున్న తీరు చూసి..యూత్ సారా ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.