
బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ `అఖండ` తర్వాత మరోసాని సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు బాలయ్య. పక్కా కమర్షియల్ హిట్ కొట్టేందుకు పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ ‘ఎన్బీకే107’తో (NBK107) ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా ఈ చిత్రం తర్వాత వెంటనే బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నటించనున్నాను.
పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్, కామెడీ చిత్రంగా రానున్న బాలయ్య 108వ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బాలయ్య 107 చిత్రంలో గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక 108వ చిత్రంలో లీడ్ హీరోయిన్ కోసం నార్త్ బ్యూటీలను వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను సంప్రదించినట్టు సమాచారం. త్వరలోనే బాలయ్య హీరోయిన్ కు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ కత్రినా కైఫ్, విద్యా బాలన్ తో బాలయ్య కలిసి పనిచేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం బాలయ్య ‘ఎన్బీకే107’ చిత్ర షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో సక్సెస్ తో దూసుకుపోతున్న బాలయ్య- గోపీచంద్ కాంబినేషనల్ లో వస్తున్న ఈ పవర్ ఫుల్ చిత్రం కోసం అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఆ వెంటనే బాలయ్య అనిల్ రావిపూడి సినిమాకు షిఫ్ట్ కానున్నారు.