దర్శకుడు ప్రదీప్ దాదా హఠాన్మరణం, షాక్ లో బాలీవుడ్, అజయ్ దేవగణ్ ఎమోషనల్ పోస్ట్..

Published : Mar 24, 2023, 10:04 AM IST
దర్శకుడు ప్రదీప్ దాదా హఠాన్మరణం, షాక్ లో బాలీవుడ్, అజయ్ దేవగణ్ ఎమోషనల్ పోస్ట్..

సారాంశం

బాలీవుడ్ కు షాక్ తగిలింది. హిందీ పరిశ్రమ దాదా అని ముద్దుగా పిలుచుకునే దిగ్గజ దర్శకుడ ప్రదీప్ సర్కార్ కన్ను మూశారు. ఆయన మరణంతో దిగ్బ్రాంతి చెందారు బాలీవుడ్ స్టార్స్. 

బాలీవుడ్ దిగ్గజ  దర్శకుడు ప్రదీప్ సర్కార్  మరణించారు. కన్నుమూశారు.  68 సంవత్సరాల వయస్సులో ప్రదీప్ సర్కార్ కన్ను మూశారు. ఈరోజు (మార్చి 24) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రదీప్ మృతి చెందారు. గత కొంత కాలంగా ప్రదీప్ సర్కార్ మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే సడెన్ గా శరీరంలో  పొటాసియం స్థాయులు పడిపోవడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స తీసుకుంటూ ప్రదీప్  తుదిశ్వాస విడిచారు. 


పరిణీత సినిమాతో బాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను సాధించారు ప్రదీప్ సర్కార్.  లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా వంటి అద్భుతమైన సినిమాలను ఆయన తెరకెక్కించారు. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ ను పరిచయం చేశారు దాదా. అంతే కాదు చాలామంది హీరో హీరోయిన్లతో ఆయనకు ఆత్మీయ అనుబంధం ఉంది. అందుకే ఆయన మరణాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. ప్రదీప్ దాదా మృతిని జీర్ణించుకోలేకపోతున్నాననంటూ బాలీవుడ్ స్టార్ సీనియర్  హీరో అజయ్ దేవగణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

 

ప్రదీప్ సర్కార్ మృతి విషయాన్ని నటి నీతూ చంద్ర ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రియమైన దర్శకుడు ప్రదీప్ సర్కార్ దాదా మృతి తనను బాధించిందని పేర్కొన్నారు. తన సినీ కెరియర్ ఆయన సినిమాతోనే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ప్రదీప్ మృతి విషయాన్ని ఆయన సోదరి మాధురి కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన మరణ వార్త తెలిసి  బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్
Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి