మరో విషాదం :చిన్నవయసులోనే బాలీవుడ్ నటి మృతి

Surya Prakash   | Asianet News
Published : Nov 22, 2020, 01:46 PM IST
మరో విషాదం :చిన్నవయసులోనే బాలీవుడ్ నటి మృతి

సారాంశం

 ముంబైలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ  మృతిచెందారు. లీనా మృతిపై  బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  కేవలం మూడు పదుల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని ఆమె అభిమానులని విషాదంలో ముంచేసింది.

హిందీ చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. సినిమాలు, టీవీ కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న లీనా ఆచార్య మృత్యువాతపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఆమె కిడ్నీ సమస్యతో బాధపడున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ  మృతిచెందారు. లీనా మృతిపై  బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  కేవలం మూడు పదుల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని ఆమె అభిమానులని విషాదంలో ముంచేసింది.

హిందీ టెలివిజన్ సీరియల్స్‌తో తనదైన నటనతో ఆకట్టుకున్న లీనా ఆచార్య కు మంచి గుర్తింపే ఉంది. ఆమెకు సినిమా ఆఫర్స్ సైతం వచ్చాయి. అయితే ఊహించని విధంగా కిడ్నీ వ్యాధిన పడ్డారు. లీనా నటనపై ఆసక్తితో మోడలింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో  ప్రవేశించారు. 'హిచ్కీ' అనే సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

ఆ తర్వాత అనేక సినిమాల్లోనూ మేరీ హానికారక్ బీవీ, సేట్ జీ, ఆప్ కే జానే సే వంటి బుల్లితెర సీరియళ్లతో ఉత్తరాది రాష్ట్రాల్లో అభిమానులకు దగ్గరయ్యారు. ఈమె చివరగా ‘క్లాస్ ఆఫ్ 2020’ అనే వెబ్ సిరీస్‌లో నటించించారు. ఈమె రాణి ముఖర్జీ నటించిన ‘హిచ్కి’ తో పాటు పలు సినిమాల్లో నటించిన ఆకట్టుకున్నారు. లీనా ఆచార్య చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోవడం పట్ల సినీ, టీవీ సహనటులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా