షాకింగ్.. ఇకపై సోషల్ మీడియాకు బాలీవుడ్ నటి కాజోల్ దూరం.. రీజన్ ఏంటీ?

By Asianet News  |  First Published Jun 9, 2023, 6:48 PM IST

కొన్నేళ్ల పాటు బాలీవుడ్ ను ఊపూపిన సీనియర్ నటి కాజోల్ (Kajol)  తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్టు ప్రకటించింది. 
 


బాలీవుడ్ క్వీన్, సీనియర్ నటి కాజోల్ 90s  నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గానే ఉంటున్నారు. హిందీతో పాటు తమిళంలోనూ ఆయా చిత్రాల్లో నటించి దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. చివరిగా తమిళ స్టార్ ధనుష్ నటించిన ‘వీఐపీ2’లోనూ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత బాలీవుడ్ లోనే మళ్లీ బిజీ అయ్యింది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఉంది. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తున్నారు. 

అయితే, సోషల్ మీడియాలో కాజోల్ ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూనే ఉంటారు. తన సినిమా అప్డేట్స్,, కుటుంబ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇలా అభిమానులను మరింతగా ఆకట్టుకుంటూ వచ్చారు. ఈక్రమంలో తాజాగా కాజోల్ షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ లో ఇప్పటికే ఉన్న అన్ని పోస్ట్‌లను డిలీట్ చేసింది. అయితే ఎందుకు సోషల్ మీడియా బ్రేక్ ఇచ్చారనేది చెప్పలేదు. 

Latest Videos

కానీ ఆమె ట్విట్టర్ ప్రొఫైల్‌లో మునుపటి పోస్ట్‌లు మాత్రం ఉన్నాయి. కాజోల్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఇలా రాసింది, ‘నా జీవితంలో చాలా కష్టతరమైన దాన్ని ఎదుర్కోబోతున్నాను’ అంటూ క్యాప్షన్ఇచ్చింది. సోషల్ మీడియాలో కనిపించకపోవడంతో పాటు అన్ని పోస్ట్‌లను తీసివేయడానికి గల కారణాన్ని వెల్లడించకపోవడంతో ఫ్యాన్స్ ఎందుకా అని ఆరా తీస్తున్నారు. 

అయితే ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ కాజోల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను వినూత్నంగా ప్రచారం చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజోల్ తన రాబోయే సిరీస్ ‘ది గుడ్ వైఫ్’  సిరీస్ ప్రచారంలో భాగంగా ఇలా చేసిందా అంటూ కూడా సందేహాలు వస్తున్నాయి. ఇక దీనిపై మళ్లీ కాజోల్ స్పందించే వరకు క్లారిటీ రావడం కష్టమనే అర్థం అవుతోంది. 

కాజోల్ చివరిగా హిందీలో ‘సలామ్ వెంకీ’ చిత్రంలో అలరించారు. ప్రస్తుతం డైరెక్టర్ ఆర్ బాల్కీ దర్శకత్వంలో వస్తున్న ‘లస్ట్ స్టోరీస్ 2’తోపాటు అలాగే ‘సర్జమీన్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. 

click me!