బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు గాయాలు.. ఎలా జరిగింది? ఇప్పుడెలా ఉంది?

Published : Mar 24, 2023, 12:53 PM IST
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు గాయాలు.. ఎలా జరిగింది? ఇప్పుడెలా ఉంది?

సారాంశం

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar)  తాజాగా గాయపడ్డారు. ఈ సందర్బంగా అభిమానులు ఆందోళన పెడుతున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఆరోగ్యం ఇలా ఉందంటూ సమాచారం.   

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. చివరిగా ‘రామ్ సేతు’, ‘సెల్ఫీ’ చిత్రాలతో అలరించారు. సినిమాల ఫలితాలు ఎలాగున్నా.. అభిమానులను కొత్త కథనాలతో అలరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అక్షమ్ కుమార్ ఓ భారీ యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాష్ (Tiger Shroff) మరియు అక్షయ్ కుమార్ కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘బడే మియా చోటే మియా’ టైటిల్ తో సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

అయితే, ప్రస్తుతం షూటింగ్ స్కాట్ లాండ్ లో కొనసాగుతోంది. అక్కడ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. తాజాగా చిత్రీకరణ కొనసాగుతుండగా స్టంట్ చేసే  క్రమంలో అక్షయ్ మోకాలి గాయం తగిలినట్టు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు.  అయితే దెబ్బ తీవ్రంగా లేదని వెల్లడించారు. కాస్తా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని, షూటింగ్ కు మళ్లీ సిద్ధమవుతారని  చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రత్యేకమైన సీన్ ను హోల్డ్ లో పెట్టి మిగితా సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు తెలిపారు. 

స్కాట్ లాండ్ షూటింగ్ షెడ్యూల్ ముగించడంలో ఎలాంటి ఆలస్యం ఉండబోదని చెప్పారు. శరవేగంగా షూటింగ్ జరుగుతుందన్నారు. ఇద్దరు యాక్షన్ హీరోలతో భారీ యాక్షన్ తో వస్తున్న చిత్రం Bade Miyan chote Miya.  ఈ మూవీకి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, అలయ, మనూషీ చిల్లర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీలో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఏడాది క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సూరారైపోట్రుకు హిందీ రీమేక్ గా వస్తున్న చిత్రంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా సెప్టెంబర్ 01 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుందని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు