అతను బినామీ ప్రొడ్యూస‌రా..మరెందుకంత బిల్డప్?!

By Surya PrakashFirst Published Mar 8, 2020, 9:39 AM IST
Highlights

గత కొద్ది కాలంగా తెలుగులో ఓ బినామీ ప్రొడ్యూసర్ మొదలయ్యాడు. ఆయన కాస్త యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నాడని మీడియా వాపోతోంది. అసలు కన్నా కొసరు కు ఎక్కువ అన్నట్లు ఈ ప్రొడ్యూసర్ ...రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కన్నా హంగామా గట్టిగా చేస్తున్నాడు. 

ప్రతీచోటా ఉన్నట్లే సినీ పరిశ్రమలోనూ బినామీ లు ఉంటారు. అయితే బినామీలు సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతూంటారు. తమకు పై నుంచి వచ్చే ఫండ్స్ ని బయిటకు తెలియకుండా, జాగ్రత్తగా ఖర్చు పెడుతూ...ఓ రూపాయి వెనకేసుకుంటూ ముందుకు వెళ్తూంటారు. అయితే అంతలా రెచ్చపోరు. బిల్డప్ లు ఇవ్వరు. కానీ గత కొద్ది కాలంగా తెలుగులో ఓ బినామీ ప్రొడ్యూసర్ మొదలయ్యాడు. ఆయన కాస్త యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నాడని మీడియా వాపోతోంది. అసలు కన్నా కొసరు కు ఎక్కువ అన్నట్లు ఈ ప్రొడ్యూసర్ ...రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కన్నా హంగామా గట్టిగా చేస్తున్నాడు. 

ఈ బినామీ ప్రొడ్యూసర్ గతంలో ఫిల్మ్ జర్నలిస్ట్ గా చేసినవాడు. అలాగే రివ్యూ రైటర్ గా ఇండస్టీలోకి వచ్చినవాడు. ఆయన ఇప్పుడు వరస పెట్టి పెద్ద ప్రాజెక్టులు ఇనీషియేట్ చేస్తున్నాడు. ఈ వెనక ఓ స్టార్ హీరో ఉండటం కలిసొస్తోంది. అలాగే ఆయనకు అధికార పార్టీకు చెందిన కొందరు బ్యాకింగ్ ఉన్నారట. ఇన్నాళ్లూ అందరూ అతన్ని ఎంకరేజ్ చేస్తున్న హీరోనే ఇలా బినామీగా పెట్టుబడులు పెడుతున్నారని భావించారు. అయితే అలాంటిదేమీ లేదని అదంతా రాజకీయాల్లోంచి వస్తున్న డబ్బుగా చెప్పుతున్నారు. 

ఇక ఈ నిర్మాత తనేంటో తన గొడవేంటో చూసుకుంటే బాగుండేది. మిగతా హీరోల కలెక్షన్స్ గురించి తక్కువ చేసి మాట్లాడటం,మీడియా మిత్రులనే చిన్న చూపు చూడటం చేస్తూంటాడు. మాట్లాడితే నేను మీ నుంచి వచ్చినవాడినే కదా నా గురించి మీకు తెలియదా అని జోక్ వేసినట్లు వేసి,తన పవర్ చూపించటానికి ప్రయత్నిస్తూంటాడు. మొత్తానికి బినామీ ప్రొడ్యూసర్ కు బిల్డప్ ఎక్కువే అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. గీచి గీచి బేరమాడటం అతని నైజం. 

click me!