సినీ నటి పై కాల్పులు, మాఫియాతో విభేదాలే?

Published : Dec 16, 2018, 11:02 AM ISTUpdated : Dec 16, 2018, 11:05 AM IST
సినీ నటి పై  కాల్పులు, మాఫియాతో విభేదాలే?

సారాంశం

గతంలో ఆర్దిక నేరాలపై అరెస్ట్ అయిన నటి, మోడల్ లీనాపాల్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై  ఐదు నిముషాల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై కాల్పులు జరిపి పరారైనట్టుగా పోలీసులు తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగిన సమయంలో లీనా తన బ్యూటీ పార్లర్‌ నెయిల్‌ ఆర్టిస్ట్రీ లో ఉన్నారు. అయితే పార్లర్‌ బిజీగా ఉండటంతో దుండగులు బయటి నుంచే ఎయిర్‌ గన్స్‌తో కాల్పులు జరిపారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 

మాఫియాతో, అండర్‌ వరల్డ్‌ తో ఉన్న ఆర్థిక పరమైన విభేదాలే దాడికి కారణమని భావిస్తున్నారు. పార్లర్ తో పాటు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు  స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. 

గతంలో లీనాపై పలు ప్రాంతాల్లో చీటింగ్ కేసులు నమైదయ్యాయి. 2013, 2015లలో చీటింగ్‌ కేసుల్లో ఈమె అరెస్ట్‌అయినట్టుగా పోలీసులు తెలిపారు. జాన్‌ అబ్రహం హీరోగా తెరకెక్కిన మద్రాస్‌ కేఫ్‌తో పాటు మోహన్‌ లాల్ రెడ్‌చిల్లీస్‌ సినిమాల్లో లీనా కీలక పాత్రల్లో నటించారు.

PREV
click me!

Recommended Stories

Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా