సోహైల్‌ కథ వేరేలా ఉందిగా.. అప్పుడే కొత్త సినిమా అనౌన్స్ మెంట్‌

Published : Dec 24, 2020, 08:46 AM ISTUpdated : Dec 24, 2020, 10:43 AM IST
సోహైల్‌ కథ వేరేలా ఉందిగా.. అప్పుడే కొత్త సినిమా అనౌన్స్ మెంట్‌

సారాంశం

సోహైల్‌ ట్రోఫీ గెలవలేకపోయిన అందరి మనసులను గెలుచుకున్నాడు. అసలైన విన్నర్‌గా నిలిచాడు. హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక సోహైల్‌కి చాలా సినీ ఆఫర్స్ వస్తున్నాయి. రావడం మాటేమోగానీ ఇప్పుడు ఏకంగా ఓ సినిమా అనౌన్స్ మెంట్‌ కూడా జరిగింది. 

బిగ్‌బాస్‌ 4 టాప్‌ 3లో ఉన్న కంటెస్టెంట్‌ సోహైల్‌ ఫైనల్‌ రోజే అసలైన విన్నర్‌గా నిలిచారు. బిగ్‌బాస్‌ ఇచ్చిన 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని పర్సనల్‌గా జాక్‌పాట్‌ కొట్టడంతోపాటు వేదికపై నాగార్జున, చిరంజీవి వంటి బిగ్‌ స్టార్స్ మనసులను గెలుచుకున్నాడు. అంతిమంగా అందరి హార్ట్ లను కొల్లగొట్టాడు. సోహైల్‌ పది లక్షలు ఇవ్వాలనుకున్న ఆర్ఫనేజ్‌కి తాను ఇస్తానని నాగార్జున తెలిపారు. అంతేకాదు అందరి ముందు వేదికపై సోహైల్‌ని నాగార్జున ఎత్తుకోవడం హైలైట్‌గా నిలిచింది. 

ఆ తర్వాత సోహైల్‌ సినిమా తీస్తానంటే అందుకు తాను సపోర్ట్ చేస్తానని చిరంజీవి చెప్పారు. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ తానే నిర్వహిస్తానన్నాడు. అంతేకాదు చిన్న కోమియో కూడా పెడితే తాను ఫ్రీ నటిస్తానని చెప్పాడు. అంతటితో ఆయిపోలేదు. బ్రహ్మానందం తన సినిమాలో నటిస్తానని స్వయంగా చెప్పాడు. దీంతో సోహైల్‌ ట్రోఫీ గెలవలేకపోయిన అందరి మనసులను గెలుచుకున్నాడు. అసలైన విన్నర్‌గా నిలిచాడు. 

హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక సోహైల్‌కి చాలా సినీ ఆఫర్స్ వస్తున్నాయి. రావడం మాటేమోగానీ ఇప్పుడు ఏకంగా ఓ సినిమా అనౌన్స్ మెంట్‌ కూడా జరిగింది. `జార్జిరెడ్డి`, `ప్రెజర్‌ కుక్కర్‌` వంటి సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి.. సోహైల్‌ హీరోగా ఓ సినిమాని గురువారం ప్రకటించారు. దీనికి శ్రీనివాస్‌ వింజనంపతి అనే కొత్త దర్శకుడు డైరెక్షన్‌ చేయబోతున్నారు. మైక్‌ మూవీస్‌ పతాకంపై భారీ లెవల్‌లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారట. బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్‌ని ఈ సినిమాతో క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?