శేఖర్ కమ్ముల ఈ మధ్యనే ఫిదాతో పెద్ద హిట్ ఇచ్చాడు. అలాగే నాగచైతన్య కూడా మజిలీ, వెంకీ మామ వంటి సినిమాలతో ఫామ్ లోనే ఉన్నాడు. ఇక యూత్ లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దీనితో ఈ సినిమాకు మంచి హైప్ ఉంది.
తనదైన స్టైల్ లో కూల్ గా ప్రేమ కథలను తెరకెక్కించి ప్రేక్షకులను తన మ్యాజిత్ మాయచేయడంతో దిట్ట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల ముందుకు తీసుకురావడటమే మిగిలిందంటూ ఆ చిత్ర టీమ్ ఆ మధ్య ప్రకటించింది. అయితే రిలీజ్ ఇంకా లేటయ్యేటట్లు ఉందిట. శేఖర కమ్ముల స్లోగా ఎప్పటిలాగే పనలు నడిపిస్తున్నారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఈ సినిమా ఉంది.
నాగచైతన్య ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2021 జనవరిలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ శేఖర్ కమ్ముల ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాలేదని చెప్పారట. దాంతో ఈ సినిమా ఏప్రియల్ రిలీజ్ కు వెళ్లేటట్లు ఉంది. దాంతో చైతన్య ..విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందే ధాంక్యూ సినిమాకు షిప్ట్ అవుతున్నారు.
శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యువ సంగీత దర్శకుడు పవన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్‌కు ముందు సగం.. లాక్‌డౌన్ తర్వాత మిగతా సగం పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మరో ప్రక్క సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈ సారి లాక్‌డౌన్ విరామంలో తన తర్వాతి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను పూర్తి చేసుకున్నారు. లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ ను చేయమని కోరగానే.. ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది.