
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్‌పై ఫన్నీ కామెంట్ చేశారు నటి రాఖీ సావంత్. ఆయన, తన భార్య కిరణ్‌రావు విడాకులు తీసుకుంటున్నట్టు శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది సినీ ప్రముఖులు విచారాన్ని వ్యక్తం చేస్తుండగా, రాఖీ సావంత్ మాత్రం సెటైర్లు వేశారు. అంతేకాదు ఎవరైనా విడాకులు తీసుకుంటే తనకు చాలా బాధగా ఉంటుందని తెలిపింది.
శనివారం మీడియా కంటపడిన రాఖీ సావంత్‌ని.. ఆమీర్ విడాకుల విషయంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా, నిజంగానే ఆమీర్ విడాకులు తీసుకున్నారా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. దీన్ని నమ్మలేకపోతున్నానని, ఎవరైనా విడాకులు తీసుకుంటే తనకు చాలా బాధగా ఉంటుందని తెలిపింది. తాను ప్రజెంట్ సింగిల్‌గానే ఉన్నట్టు చమత్కరించింది.
ఈ సందర్భంగా తన పాత ఇంటర్వ్యూని గుర్తు చేసింది. ఆమీర్ ఖాన్‌తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకుని కిరణ్ రావుని పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదని తెలిపింది. ఇదే విషయాన్ని ఆమీర్‌తో చెప్పిందట. అయితే తన సలహాని ఇప్పుడు ఆమీర్ సీరియస్‌గా తీసుకున్నారా ఏంటి? అంటూ సెటైర్లు వేసింది. ఇదిలా ఉంటే ఇటీవల బిగ్‌బాస్ లో సందడి చేసిన ఈ బ్యూటీ మోస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. అంతేకాదు ఆమె రితేష్ అనే ఓ మిస్టీరియస్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయనతో రిలేషన్ కుదరక, ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుందట రాఖీ.