ప్రభాస్‌ లేకుండానే `ఆదిపురుష్‌` షూటింగ్‌.. `సలార్‌` స్టార్‌తో వాణీ కపూర్‌

Published : Jul 04, 2021, 07:46 AM IST
ప్రభాస్‌ లేకుండానే `ఆదిపురుష్‌` షూటింగ్‌.. `సలార్‌` స్టార్‌తో వాణీ కపూర్‌

సారాంశం

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయిన `ఆదిపురుష్‌` చిత్ర షూటింగ్‌ తాజాగా శనివారం ప్రారంభమైంది. ముంబయిలో షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. మరోవైపు సలార్‌తో వాణి కపూర్‌ జోడీ కట్టబోతుంది.

ప్రభాస్‌ నటిస్తున్న భారీ చిత్రాల్లో ఒకటి `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి సనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వం  వహిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయిన చిత్ర షూటింగ్‌ తాజాగా శనివారం ప్రారంభమైంది. ముంబయిలో షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. ఇందులో సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఇంకా ఇందులో ప్రభాస్‌ పాల్గొనేందుకు కాస్త టైమ్‌ పడుతుందని సమాచారం. 

అయితే ప్రభాస్‌ హైదరాబాద్‌లో `రాధేశ్యామ్‌` షూటింగ్‌లో పాల్గొంటున్నారు. పెండింగ్‌లో ఉన్న కొన్ని సన్నివేశాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక్కడ `రాధేశ్యామ్‌` షూటింగ్‌ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రభాస్‌ `ఆదిపురుష్‌` షూటింగ్‌లో జాయిన్‌ అవుతారట. ఈ లోపు ప్రభాస్‌ లేని సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఓం రౌత్‌ బృందం బిజీ అయ్యింది. త్రీడీగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. దాదాపు 400కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. తెలుగు, హిందీతోపాటు ఇతర భాషల్లో కూడా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్‌లోకి తీసుకురాబోతున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్‌తో `ఆహాకళ్యాణం` బ్యూటీ వాణీ కపూర్‌లో రొమాన్స్ చేయబోతుందట. `సలార్‌` చిత్రంలో ఆమెని కీలక పాత్ర కోసం ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తెలుగులో నా ఫేవరెట్ హీరో అతడే.. ఒక్కసారైనా కలిసి నటించాలి.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్
'పెళ్లి చేసుకోవడానికి వయస్సు ఉంటే సరిపోదు.. కావాల్సింది అదే'..