నోయల్‌ చెప్పిందంతా అబద్దమా?.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌!

By Aithagoni RajuFirst Published Oct 18, 2020, 7:28 PM IST
Highlights

నోయల్‌ సైతం సింపతి కలిగేలా తమ ఫ్యామిలీ ఇబ్బందులను తెలిపి అందరిచేత కన్నీళ్ళు పెట్టించారు. ఈ సందర్భంగా నోయల్‌ చెబుతూ, వాళ్ళ ఇళ్లళ్ళో పనిచేసేదని, వాళ్ల నాన్న రోజు వారి కూలీ పనులు చేసేవారని, ఇస్త్రీ, మేస్త్రీ పనులు చేసి తమని పెంచారని పేర్కొన్నారు. 

బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో మూడు రోజుల క్రితం కంటెస్టెంట్స్ తమ బాధలు చెప్పుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు. ముఖ్యంగా వారి జీవితంలో చేదు జ్ఞాపకాలను, కదలించిన విషయాలను పంచుకుంటూ ఆడియెన్స్ చేత కన్నీళ్ళు పెట్టించారు. దీంతో అందరు సభ్యులపై ఆడియెన్స్ లో పాజిటివ్‌ ఒపీనియన్‌ కలిగింది. అందరిపై సింపతీ ఏర్పడింది. 

అందులో భాగంగా నోయల్‌ సైతం సింపతి కలిగేలా తమ ఫ్యామిలీ ఇబ్బందులను తెలిపి అందరిచేత కన్నీళ్ళు పెట్టించారు. ఈ సందర్భంగా నోయల్‌ చెబుతూ, వాళ్ళ ఇళ్లళ్ళో పనిచేసేదని, వాళ్ల నాన్న రోజు వారి కూలీ పనులు చేసేవారని, ఇస్త్రీ, మేస్త్రీ పనులు చేసి తమని పెంచారని పేర్కొన్నారు. 

కానీ నోయల్‌ మొన్న చెప్పింది తప్పు అని, ఆయన అన్ని అబద్దాలు చెప్పారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అందుకు వికీపీడియాని సాక్ష్యంగా చూపిస్తున్నారు. అందులో నోయల్‌ తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని ఉంది. అయితే నోయల్‌ ఈ విషయం చెప్పిన తర్వాత దాన్ని డైలీ లేబర్‌ అని మార్చినట్టుగా ఉంది. కావాలనే నోయల్‌ తప్పు చెప్పారని, సింపతి కోసం ఇలా అబద్దాలు చెప్పాడని కామెంట్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే వికీపీడియా సమాచారాన్ని నిజమని నమ్మలేం. దానికి అథెంటిసిటీ ఉండదని, అందులోని సమాచారాన్ని నిజంగా ధృవీకరించలేమని నోయల్‌ అభిమానులు అంటున్నారు. వారు చెప్పేది కూడా నిజమే కావచ్చని అంటున్నారు. జాబ్‌ రావడానికి ముందు కూలీ పనిచేసేవాడేమో అంటున్నారు. మొత్తానికి నోయల్‌.. ఆయన వర్గం, ఆయన ఆంటీ వర్గంతో కామెంట్లతో ట్రోల్‌ అవుతుందని చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం నోయల్‌ హౌజ్‌ కెప్టెన్‌గా ఉన్నారు. ఆయనలో జోష్‌ తగ్గిందని, మొదట్లో ఉన్నంత ఉత్సాహం కనిపించడం లేదని కామెంట్‌ వినిపిస్తుంది. నిన్న నాగార్జున సైతం ఇలాంటి కామెంటే చేశారు. దీనికి తోడు పలు మార్లు తనని బయటకు పంపించేయండి అని కెమెరాల ముందు బిగ్‌బాస్‌తో చెప్పాడు. ఇవన్నీ నోయల్‌పై నెగటివ్‌ ఒపీనియన్‌ని పెంచుతున్నాయి. ఇది నోయల్‌ ఫేక్‌ గేమ్‌గా నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

PR mundhu migatha andariki PRs jujubees 😂😂 all other armies.. 👇👇 pic.twitter.com/6jiWEM72co

— Chitti (@iChittiRobot)

Take a big bow to PR team.
watch this YT link 👇👇https://t.co/AUC71dUjNM

— Chitti (@iChittiRobot)

Velli episode chudu Tanu vala nanna job search unnapidu ani chepthadu a time lo, a tharvatha vala nanna job vachindi, wiki evarina edit cheyochu.

— Siva (@siva_bb)

Noel father is a retired defence employee!

His team tries to convince Noel lies through Wikipedia but later reverted.



Link: https://t.co/kiF5Ky5rP7 pic.twitter.com/SSSdGb0X0e

— Mohan Peram (@MohanPeram)
click me!