బిగ్ బాస్2: నామినేషన్స్ లో తనీష్ షాక్ ఏంటో..?

By Udayavani DhuliFirst Published Aug 20, 2018, 12:03 PM IST
Highlights

ముందుగా శ్యామల.. ఆయన ఎక్కువగా మాట్లాడరు అని చెప్పడం దాన్ని బట్టి అమిత్ అని తెలుస్తోంది. దీప్తి కూడా అమిత్ పేరే చెప్పినట్లుగా అనిపిస్తోంది. ఇక సామ్రాట్ గేమ్ కాకుండా బాండింగ్ కూడా ముఖ్యమేనని చెబుతున్నాడంటే కచ్చితంగా కౌశల్ అని గెస్ చేస్తున్నారు

బిగ్ బాస్ సీజన్ పదివారాలు పూర్తయింది. నిన్నటి  ఎపిసోడ్ లో దీప్తి సునైనా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హౌస్ లో ఎలిమినేషన్ కి నామినేషన్స్ వచ్చేశాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ ఒక్కొక్కరిని పిలిచి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో.. కారణాలు చెప్పమని అడిగారు. ఈసారి కూడా హౌస్ మేట్స్ లో కొందరు కౌశల్ ని టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తుంది.

ముందుగా శ్యామల.. ఆయన ఎక్కువగా మాట్లాడరు అని చెప్పడం దాన్ని బట్టి అమిత్ అని తెలుస్తోంది. దీప్తి కూడా అమిత్ పేరే చెప్పినట్లుగా అనిపిస్తోంది. ఇక సామ్రాట్ గేమ్ కాకుండా బాండింగ్ కూడా ముఖ్యమేనని చెబుతున్నాడంటే కచ్చితంగా కౌశల్ అని గెస్ చేస్తున్నారు. గీతామాధురి టర్న్ వచ్చినప్పుడు ఆయన కొన్ని కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు నాకు నచ్చలేదంటూ కౌశల్ గురించే చెప్పి ఉంటుంది.

ఇక తనీష్ మాత్రం నేను ఈ పేరు చెబితే చాలా మంది షాక్ అవ్వొచ్చు అంటూ మొదలుపెట్టాడు అంటే కచ్చితంగా కౌశల్ అయితే కాదు. మరి తనీష్ ఎవరిని నామినేట్ చేయబోతున్నాడో ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది!


ఈ వార్తలు కూడా చదవండి..

బిగ్ బాస్2: దీప్తి సునైనా ఔట్.. ఎమోషనల్ అయిన తనీష్

బిగ్ బాస్2: సునైనాతో విజయ్ దేవరకొండ ఏం చేయించాడంటే!

బిగ్ బాస్2: కౌశల్ కి నాని క్లాస్.. గీతా, శ్యామల సేఫ్

కౌశల్ ని తల్చుకుంటే బాధగా ఉంది.. నూతన్ నాయుడు!

click me!