బిగ్ బాస్2: కౌశల్ ని కంట్రోల్ చేస్తోన్న హౌస్ మేట్స్!

Published : Sep 20, 2018, 04:14 PM IST
బిగ్ బాస్2: కౌశల్ ని కంట్రోల్ చేస్తోన్న హౌస్ మేట్స్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్2 లో ఈ వారం మొత్తం గొడవలే జరిగేలా ఉన్నాయి. సోమవారం నాడు హౌస్ మేట్స్ కి కౌశల్ కి మధ్య గొడవ మొదలైంది. ఆరోజు నుండి ఏదొక కారణంతో హౌస్ మేట్స్ కౌశల్ తో గొడవ పడుతూనే ఉన్నారు

బిగ్ బాస్ సీజన్2 లో ఈ వారం మొత్తం గొడవలే జరిగేలా ఉన్నాయి. సోమవారం నాడు హౌస్ మేట్స్ కి కౌశల్ కి మధ్య గొడవ మొదలైంది. ఆరోజు నుండి ఏదొక కారణంతో హౌస్ మేట్స్ కౌశల్ తో గొడవ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కౌశల్ కూడా నోరుజారి కామెంట్స్ చేశారు.

ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ రోల్, సామ్రాట్ లకు 'సేవ్ ది ఎగ్స్' అనే టాస్క్ ని ఇచ్చారు. వీరిద్దరిలో ఎవరైతే గుడ్లను సేవ్ చేస్తారో వారు నేరుగా ఫినాలేకి వెళ్తారు. అయితే కౌశల్.. రోల్, సామ్రాట్ ల దగ్గరున్న గుడ్లను పగలగొట్టడానికి ప్రయత్నిస్తుండగా గీతామాధురి, తనీష్, దీప్తిలు కౌశల్ ని అడ్డుకుంటూ రోల్, సామ్రాట్ లకు మద్దతు తెలుపుతున్నారు.

అయితే ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోల్, సామ్రాట్ ఇద్దరి దగ్గర ఎగ్స్ ఉంటే అప్పుడు ఈ టాస్క్ విజేత ఎవరూ కాకుండా పోతారు. ఈ విషయం తెలిసి కూడా హౌస్ మేట్స్ ఇద్దరికీ సపోర్ట్ చేయడంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగని కౌశల్ ఇద్దరిలో ఎవరో ఒకరు గెలవాలని కూడా అనుకోవడం లేదు.

ఇద్దరి గుడ్లను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ తన ఇంటెన్షన్ ఏదైనా సరే ఇక్కడ అతడు తన గేమ్ ని ఆడుతున్నాడు. కానీ మిగిలిన హౌస్ మేట్స్ మాత్రం సపోర్ట్ చేస్తున్నామనుకుంటూ తమ ఆటను మర్చిపోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?