
బిగ్ బాస్2 ఈ వారం ఎలిమినేషన్ లో ముందు నుండి ఊహించినట్లుగానే బాబు గోగినేని బయటకి వచ్చేసినట్లు తెలుస్తోంది. హౌస్ మేట్స్ అందరితో బిగ్గర్ బాస్ అని పిలిపించుకునే గోగినేనిని కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. హౌస్ లో కూడా ఆయన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే ఆయన హౌస్ నుండి బయటకి వచ్చేశాడనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిలో గీతామాధురి, శ్యామల సేవ్ అయినట్లు నాని నిన్నటి ఎపిసోడ్ లో ప్రకటించగా మిగిలిన దీప్తి, గణేష్, తనీష్, బాబు గోగినేనిలలో బాబుకి తక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. హౌస్ లో అందరినీ సమానంగా ట్రీట్ చేసే బాబు గోగినేని.. కౌశల్ విషయంలో మాత్రం ఆయనకు వ్యతిరేకంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఒకానొక దశలో కౌశల్ ని ఇంటి నుండి పంపేయాలంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
దీంతో చాలా రోజులుగా కౌశల్ ఆర్మీ బాబు గోగినేనికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్ట్ లు, కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఈసారి ఆయన నామినేషన్ లో ఉండడంతో తక్కువ ఓట్లు వచ్చేలా చేసి బయటకి వెళ్లడానికి కారణమైనట్లు తెలుస్తోంది. మరి బాబు గోగినేని ఎలిమినేట్ అయ్యాడేమో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది!