బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో తొలి వారం ఆసక్తికరంగా ముగిసింది. ఎవరూ ఊహించని విధంగా శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయ్యాక ఆమె కొందరు కంటెస్టెంట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వివరాలు బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ లో తెలుసుకుందాం.

05:09 PM (IST) Sep 15
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా రాణించిన సుమన్ శెట్టి ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో సందడి చేస్తున్నారు. మరి ఈ షోకోసం సుమన్ శెట్టి ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో తెలుసా?
12:54 PM (IST) Sep 15
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కొత్త లవ్ స్టోరీ మొదలైనట్లు సంకేతాలు అందుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో ఇమ్మాన్యుయేల్, తనూజ ఇద్దరూ చిలిపిగా, రొమాంటిక్ గా కనిపిస్తున్నారు.
09:59 AM (IST) Sep 15
ఒకప్పటి పాపులర్ కమెడియన్ సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌజ్‌లో సందడి చేస్తున్నారు. ఆయన మొదటి వారం నామినేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం ఎపిసోడ్‌లో ఆయన సేవ్ అయినప్పుడు చాలా మంది అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. క్లాప్స్ కొట్టారు. అది ఆయనకున్న క్రేజ్‌ని తెలియజేస్తుంది.
06:47 AM (IST) Sep 15
కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ మొదటి వారం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె భరణి, రీతూ చౌదరీ, తనూజల బండారం బయటపెట్టింది.