Bigg Boss Telugu 9 Day 4 Live : బిగ్ బాస్ తెలుగు 9 షో రోజు రోజుకీ రసవత్తరంగా మారుతోంది. హౌస్ లో నాలుగో రోజుకి సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ తెలుసుకుందాం.

06:06 PM (IST) Sep 11
గ్లామర్ బ్యూటీ రీతూ చౌదరీ బిగ్ బాస్‌లోకి వెళ్లి తనదైన స్టయిల్‌లో పులిహోర కలుపుతుంది. అయితే ఆమె అసలు స్వరూపం బయటపెట్టాడు జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్.
03:40 PM (IST) Sep 11
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో నిన్నటి వరకు హోనర్స్ కాస్త యూనిటీగా కనిపించారు. కానీ ఇప్పుడు వారి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ప్రియా, దమ్ము శ్రీజ విషయంలో మర్యాద మనీష్ కొన్ని కంప్లెయింట్స్ ఇవ్వగా, వారు తీసుకోలేదు. మీ ఇద్దరు ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారని ఆరోపించగా, ప్రియా, శ్రీజ రివర్స్ అయ్యారు. హెనర్స్ హౌజ్ హీటెక్కిపోయింది.
03:38 PM (IST) Sep 11
బిగ్ బాస్ షోలో సీరియస్‌తోపాటు ఫన్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఆ బాధ్యతలు ఇమ్మాన్యుయెల్ తీసుకున్నారు. ప్రారంభంలో కాస్త సైలెంట్‌గా ఉన్న ఇమ్మాన్యుయెల్ తాజాగా రెచ్చిపోయారు. అమ్మాయిగా మారి సందడి చేశారు. నవ్వులు పూయించాడు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.
07:28 AM (IST) Sep 11
Bigg Boss Telugu 9 Voting:బిగ్ బాస్ తెలుగు 9 తొలి వారం ఓటింగ్ హీట్ పిక్‌కి చేరింది . కన్నడ బ్యూటీ తనూజ టాప్‌లో దూసుకెళ్తుండగా, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఫ్లోరా, సంజనా, శ్రేష్టి వర్మ లు డేంజర్ జోన్‌లో చిక్కుకోవడంతో ఎలిమినేషన్‌పై ఉత్కంఠ పెరిగింది!