వైల్డ్ కార్డ్ ద్వారా క్రేజీ కంటెస్టెంట్లు ఎంట్రీ, ఎంత మందో తెలిస్తే షాకే, ఇక హౌజ్‌మేట్స్ కి చుక్కలే!

By Aithagoni RajuFirst Published Oct 1, 2024, 8:06 AM IST
Highlights

బిగ్‌ బాస్‌ తెలుగు 8లోకి ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గట్టిగానే ఉండబోతున్నాయట. ఎప్పుడూ లేని విధంగా సుమారు పది మంది మాజీ క్రేజీ కంటెస్టెంట్లని దించుతున్నారట.  
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ రియాలిటీ షో 14 మందితో సెప్టెంబర్‌ 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షో ఇప్పటి వరకు నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఈ హౌజ్‌లో నలుగురు ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం పది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. హౌజ్‌లో ఒక్కరు కూడా తెలిసిన ఫేస్‌లు లేకపోవడంతో షోకి రేటింగ్‌ కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఒకప్పుడు హీరోగా ఉన్న ఆదిత్య ఓం హౌజ్‌లో ఉన్నాడా? నిద్ర పోతున్నాడా అర్థం కావడం లేదు. కంటెస్టెంట్లు గేమ్‌ల్లో బాగానే కొట్టుకున్నారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

Latest Videos

కానీ కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్‌ కావడం లేదు. సోనియా.. నిఖిల్‌, పృథ్వీలతో పులిహోర కలిపినా అది వర్కౌట్‌ కాలేదు. అక్కడ బాండింగ్‌ కనిపించడం లేదు కదా, ఆమె చేసే పనులు వల్గర్‌గానూ అనిపిస్తున్నాయి. యష్మి.. ఎప్పుడూ మణికంఠని టార్గెట్‌ చేస్తూ తన రివేంజ్‌ తీర్చుకుంటుంది. పర్సనల్‌గా వెళ్లిపోతూ కంపు పుట్టిస్తుంది. మొత్తంగా బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్ జస్ట్ నడుస్తుంది, కానీ ఏదో మిస్‌ అయ్యింది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఛాన్సే లేకుండా పోతుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లోకి మాజీ కంటెస్టెంట్లు..

ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గట్టిగానే ఉండబోతున్నాయని తెలుస్తుంది. మొదట ఐదుగురు మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారనే ప్రచారం జరిగింది. గతంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్తవారినే తీసుకొచ్చేవాళ్లు. కానీ ఈ సారి మాత్రం అంతా పాతవారిని దించుతున్నట్టు తెలుస్తుంది. కంటెంట్ కోసం, షో రక్తికట్టడం కోసం మాజీలను దించుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో కామెడీ చేసే వాళ్లకి ప్రయారిటీ ఇస్తున్నారట.

అందులో భాగంగా పలువురు క్రేజీ కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. పలువురు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో ఈ సారి ఎక్కువగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నట్టు సమాచారం. సుమారు పది మంది వరకు వచ్చే ఛాన్స్‌ ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లకి దీటుగా వాళ్లని దించుతున్నారట. 

యాంకర్‌ రవి, మెహబూబ్‌, గౌతమ్‌ కృష్ణ, గంగవ్వ..

లేటెస్ట్ సమాచారం మేరకు వైల్డ్ కార్డ్ ద్వారా యాంకర్‌ రవి రాబోతున్నాడట. ఆయన్ని ముందుగానే బిగ్‌ బాస్‌ నిర్వాహకులు అప్రోచ్‌ అయ్యారు. కానీ వచ్చేందుకు నో చెప్పాడట. కానీ ఇప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. వైల్డ్ కార్డ్ ద్వారా యాంకర్‌ రవి ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అయ్యారని టాక్‌. యాంకర్‌ రవితోపాటు మెహబూబ్‌ దిల్సే కూడా రాబోతున్నారట. ఆయన కూడా కన్ఫమ్‌ అయినట్టు సమాచారం. సోహైల్‌తో కలిసి మెహబూబ్‌ మంచి ఆటతీరుని కనబరిచిన విషయం తెలిసిందే.

అలాగే కొత్తగా గంగవ్వ పేరు తెరపైకి వచ్చింది. ఆమె నాల్గో సీజన్‌లో హౌజ్‌లోకి వచ్చింది. కానీ అనారోగ్యం కారణంగా మధ్యలోనే వెళ్లిపోయింది. కానీ ఉన్నన్ని రోజులు బాగానే ఎంటర్‌టైన్‌ చేసింది. ఇప్పుడు ఆమెని మరోసారి హౌజ్‌కి తీసుకురాబోతున్నారని సమాచారం. అలాగే గత సీజన్‌లో సందడి చేసిన గౌతమ్‌ కృష్ణ కూడా రాబోతున్నారట. వైల్డ్ కార్డ్ ద్వారా ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అలాగే గత సీజన్‌లోనే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి, ఆ వెంటనే ఎలిమినేట్‌ అయిన నయని పావని కూడా ఈ సారి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌లోకి అడుపెడుతున్నట్టు సమాచారం. 

శోభా శెట్టి, టేస్టీ తేజ, అవినాష్‌, రోహిణి, హరితేజ..

వీరితోపాటు గత సీజన్‌లోనే సందడి చేసిన కంటెస్టెంట్లు ఉన్నారు. ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న, నాగినీగా ఆడియెన్స్ పిలుచుకున్న శోభాశెట్టిని మళ్లీ తీసుకురాబోతున్నారట. ఆమె ఉంటే ఆట రచ్చ వేరే ఉంటుందని భావించి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ చేయిస్తున్నట్టు సమాచారం. ఆమెతోపాటు గత సీజన్‌లోనే ఫన్‌తో ఆకట్టుకున్న టేస్టీ తేజని సైతం వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది.

మరోసారి అతని పేరు వినిస్తుంది. హౌజ్‌లో ఈ సారి ఫన్‌ మిస్‌ అయ్యింది. కంటెస్టెంట్లు ముచ్చట్లు పెట్టుకోవడం, ఆరోపణలు చేసుకోవడం తప్పితే, ఫన్‌ యాంగిల్‌ బయటకు తీయడం లేదు. దీంతో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. టీవీ షో అన్నప్పుడు ఫన్‌, ఎంటర్‌టైన్‌మెంట్స్ కే ప్రయారిటీ ఉంటుంది. కానీ ఈ సారి అది బాగా మిస్‌ అయినట్టుగా అనిపిస్తుంది. నెటిజన్లు కూడా అదే ఫీల్‌ అవుతున్నారు. అందుకే తేజని రప్పిస్తున్నారు. 

పది మంది మాజీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ 

వీరితోపాటు కామెడీకి బ్రాండ్‌గా నిలుస్తున్న అవినాష్‌ ని కూడా వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నారనేది తెలిసిందే. ఆయన్ని కూడా కన్ఫమ్‌ చేశారని సమాచారం. ఆయనతోపాటు జబర్దస్త్ లేడీ కమెడియన్‌ రోహిణి దించుతున్నారట. ఫన్‌తోపాటు ఫైర్‌ ఆమె ప్రత్యేకత. ఆమె ఉంటే హౌజ్‌లో రచ్చ మరో స్థాయిలో ఉంటుంది. అందుకే ఆమెని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించబోతున్నారని సమాచారం. అలాగే హరితేజని కూడా తీసుకురాబోతున్నారు. ఆమె గతంలోనూ బిగ్‌ బాస్‌లోకి వచ్చింది.

ఇప్పుడు మరోసారి ఆమె రాబోతుందని సమాచారం. ఇలా సుమారు పది మంది మాజీ కంటెస్టెంట్లని బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఈ వారంగానీ, వచ్చే వారంగానీ ఉండబోతున్నాయని సమాచారం. నిజంగానే వీళ్లంతా వస్తే బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో రచ్చ వేరే లెవల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఏం జరుగుతుందో చూడాలి. 
 

click me!