`బిగ్‌ బాస్‌` షో కోసం పస్తులున్నా..విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ఎమోషనల్‌.. ప్రైజ్‌ మనీ మొత్తం రైతులకే ..

Published : Dec 17, 2023, 11:18 PM ISTUpdated : Dec 17, 2023, 11:22 PM IST
`బిగ్‌ బాస్‌` షో కోసం పస్తులున్నా..విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ఎమోషనల్‌.. ప్రైజ్‌ మనీ మొత్తం రైతులకే ..

సారాంశం

బిగ్‌ బాస్‌ షోకి రావడం తన డ్రీమ్‌ అని, దీనికోసం తాను పస్తులున్న రోజులు కూడా ఉన్నాయని తెలిపారు బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌. 

బిగ్‌ బాస్‌ 7 విన్నింగ్‌ ప్రైజ్‌ మనీ మొత్తాన్ని రైతులకే ఇస్తానని ప్రకటించారు విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌. బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ నేటితో(ఆదివారం) ముగిసింది. 105 రోజులపాటు సాగిన ఈ షో గ్రాండ్‌గా ముగింపు కార్డ్ పడింది. ఉత్కంఠభరింతంగా సాగిన ఈ విన్నింగ్‌ ఈవెంట్‌లో ఎట్టకేలకు ప్రశాంత్‌ విన్‌ అయ్యారు. అయితే ముందు నుంచి ఊహించినట్టే, ప్రిడిక్షన్‌ని, ఓటింగ్‌ని నిజం చేస్తూ పల్లవి ప్రశాంత్‌ని విన్నర్‌గా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. ఒక కామన్‌ మ్యాన్‌ గా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ యమాయములను దాటుకుని, ఢీ కొని నెంబర్‌ 1న గా నిలిచాడు. చరిత్ర సృష్టించాడు. 

దేశ బిగ్‌ బాస్‌ చరిత్రలోనే ఓ కామన్‌ మ్యాన్‌, రైతు బిడ్డ బిగ్‌ బాస్‌ విన్నర్‌ కావడం ఇదే తొలి సారి. అలా పల్లవి ప్రశాంత్‌ రికార్డు క్రియేట్‌ చేశాడు. విన్నర్‌ అయ్యాక పల్లవి ప్రశాంత్‌ మాట్లాడుతూ, ఎమెషనల్‌ కామెంట్స్ చేశాడు. బిగ్‌ బాస్‌ లోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డానని, పస్తులున్న రోజులున్నాయన్నారు. ఇంట్లో వాళ్లకి ఆ విషయాలు చెప్పలేదని, బిగ్‌ బాస్‌ పిలుపు కోసం, బిగ్‌ బాస్‌ దృష్టిలో పడేందుకు, షోకి వచ్చేందుకు ఎంతో హార్డ్ వర్క్ చేశానని తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జునపై ప్రశంసలు కురిపించారు. ఆయన నవ్వుపై పొగడ్తలతో ముంచెత్తాడు. తనదైన స్టయిల్‌లో కవిత చెప్పి అలరించారు. 

ఈ సందర్భంగా తన ప్రకటన చేశాడు. బిగ్ బాస్‌ ద్వారా వచ్చిన ప్రైజ్‌ మనీని రైతులకే ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రారంభంలో చెప్పినట్టుగానే చేస్తానని, అవసరంలో ఉన్న, ఆపదలో ఉన్న రైతులకు తనకు వచ్చిన రూ.35 లక్షలను అందిస్తానని, వారికి తనవంతుగా ఆడుకుంటానని తెలిపారు. ఆ విషయంలో తగ్గేదెలే అన్నాడు. రైతుల కోసమే తాను పాటు పడతానని వెల్లడించారు. ఇక గిఫ్ట్ గా వచ్చిన కారుని తన ఫాదర్‌కి ఇస్తానని, జోస్‌ లుక్కాస్‌ నగలను అమ్మకి ఇస్తానని చెప్పాడు. ఇక చివరగా తనదైన స్టయిల్‌లో మల్లొచ్చిన తగ్గేదెలే అంటూ ముగింపు పలికాడు ప్రశాంత్‌. 

ప్రశాంత్‌ ప్రారంభం నుంచి హౌజ్‌లో ఉన్నాడు. ఆయనకు వారానికి లక్ష రూపాయలు పారితోషికం అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ లెక్కన అతనికి దక్కేది 15లక్షలు, అలాగే విన్నింగ్‌ ప్రైజ్‌ మనీ 35లక్షలు, జోస్లుక్కాస్‌ నగల విలువ రూ.15 లక్షలతోపాటు బ్రెజా కారు. మొత్తంగా ఆయనకు రూ. 75లక్షల వరకు అందుకున్నాడని చెప్పొచ్చు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు