Bigg Boss 7 Grand Finale : రవితేజ కోసం టైటిల్ ను వద్దనుకున్న అమర్ దీప్... తల్లి, భార్య రియాక్షన్

Published : Dec 17, 2023, 09:47 PM ISTUpdated : Dec 17, 2023, 09:52 PM IST
Bigg Boss 7 Grand Finale :  రవితేజ కోసం టైటిల్ ను వద్దనుకున్న అమర్ దీప్... తల్లి, భార్య రియాక్షన్

సారాంశం

బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ఈరోజు ఆసక్తికరంగా కొనసాగుతోంది. హౌజ్ లోకి  తాజాగా రవితేజ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా అమర్ దీప్ ఉప్పొంగిపోయారు. తనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. 

Bigg Boss Telugu 7 Grand Finale సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుతున్నాయి. హోస్ట్ నాగర్జున ఫైనల్స్ కు మరింత జోష్ గా ఎంట్రీ ఇచ్చారు అదిరిపోయే డాన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే హౌజ్ లోని ఎక్స్ కంటెస్టెంట్లు కూడా తమ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే టాప్ 6 కంటెస్టెంట్లు కూడా తమదైన శైలిలో పెర్ఫామ్ చేశారు. ఇక ఫినాలేకు టాప్ 6 కంటెస్టెంట్ల ఫ్యామిలీని కూడా ఆహ్వానించారు. సుమ ఎంట్రీ ఇవ్వడంతో అర్జున్ అంబటి (Arjun Ambati) ఎలిమినేట్ అయ్యారు. 

ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ (RaviTeja)  హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సమయంలో అమర్ దీప్ (Amardeep) ను రవితేజకు పరిచయం చేస్తూ తనకు ఎంత పెద్ద అభిమానియో తెలిపారు. అమర్దీప్ కూడా రవితేజ అంటే ఎంతఇష్టమో చెప్పుకొచ్చారు. మాస్ మహారాజాను చూస్తూ ఎదిగానని, ఎప్పటికైనా ఆయనంత ఎదగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున అమర్ దీప్ ట్విస్ట్ ఇచ్చారు. రవితేజ సినిమాలో ఆఫర్ ఇస్తే హౌజ్ నుంచి బయటికి వస్తావా? అని అడిగాడు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా ఎస్ చెప్పాడు.రవితేజ  కోసం  టైటిల్ ను కూడా త్యాగం చేసేందుకు సిద్ధపడటం ఆశ్చర్యంగా మారింది.

అందరూ అమర్ దీప్ వచ్చేస్తాడని భావించారు. ఎగ్జిట్ గేట్ దగ్గరకి వచ్చి అమర్ దీప్ వేచి ఉండటంతో రవితేజ ఆశ్చర్యపోయారు. తన అభిమాని హీరో కోసం హౌజ్ నుంచి బయటికి వస్తాననడం చూసి భార్య, తల్లి కూడా భావోద్వేగమయ్యారు. ఇక మాస్ మహారాజా తన సినిమాలో తప్పకుండా ఆఫర్ ఉందని హామీనిచ్చాడు. ఇక నాగార్జున ప్రియాంక జైన్ (Priyanka Jain)ను ఎలిమినేట్ చేశారు. దీంతో హౌజ్ లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, యావర్, శివాజీ ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Double Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 9 డబుల్‌ ఎలిమినేషన్‌, 14వ వారం ఈ ఇద్దరు ఔట్‌.. టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే
Nagababu: సౌత్ ఆఫ్రికా నుంచి ఫోన్ చేసిన స్టార్ హీరో.. నాగబాబు, భరణి ఇద్దరి సమస్య ఒక్కటే.. అందుకే ఈ బంధం