Bigg Boss Telugu 7 : ఆఖరి నామినేషన్స్.. ఫినాలే వీక్ కు అర్జున్.. ప్రశాంత్, అమర్ మధ్య మాటల యుద్ధం

By Asianet NewsFirst Published Dec 4, 2023, 11:34 PM IST
Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్స్ కు వచ్చింది. ఈ సందర్భంగా ఇవాళ లాస్ట్ నామినేషన్ రసవత్తరంగా జరిగింది. కంటెస్టెంట్ల మధ్య జరిగిన మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది. 

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ (Bigg Boss Telugu 7) మొదటి నుంచి రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం షో చివరిదశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ముగియనుంది. ఈ సందర్భంగా చివరి నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు చాలా ఆసక్తికరంగా జరిగింది. నిన్న (ఆదివారం) గౌతమ్ కృష్ణ (Gautam Krishna)  ఎలిమినేట్ అవడంతో ఈ వారం ఇద్దరిని కంటెస్టెంట్లు నామినేట్ చేయాల్సి ఉంది. 

హౌజ్ లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు శివాజీ, అమర్ దీప్, అర్జున్, పల్లవి ప్రశాంత్, యావర్, ప్రియాంక, శోభా శెట్టి ఉన్నారు. ఇక 14వ వారం నామినేషన్స్ ద్వారా ఇద్దరు ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఫైనల్స్ కు కేవలం ఐదుగురు మాత్రమే ఉంటుంది. కాబట్టి నెక్ట్స్ ఇద్దరిని ఇంటిని నుంచి పంపించాల్సి ఉంటుంది. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరి నామినేట్ చేయాల్సి ఉంది. గెట్ అవుట్ అనే గేమ్ లో నామినేట్ చేసే కంటెస్టెంట్ ఫొటో ను టైల్ పై ప్రింట్ చేసి బ్రేక్ చేయాల్సి ఉంటుంది. 

Latest Videos

అర్జున్ ఫినాలే అస్త్రను దక్కించుకోవడంతో అర్జున్ ను నామినేట్ చేసే అవకాశం లేదు. మిగితా వారిని నామినేట్ చేయొచ్చు. ఈ సందర్భంగా ఈరోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హౌజ్ లో కంటెస్టెంట్ల వాదనలు రసవత్తరంగా జరిగాయి. నామినేషన్ ప్రక్రియను తొలుత యావర్ ప్రారంభించారు. యావర్ - శోభా శెట్టి, ప్రియాంక ను నామినేట్ చేశారు. ఆ తర్వాత శోభాశెట్టి - యావర్ ను నామినేట్ చేసింది. యావర్ కామెంట్లపై శోభా డిఫెన్స్ చేసింది. తన మేకప్ పై యావర్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ఆ తర్వాత శివాజీ (Shivaji)ని నామినేట్ చేసింది. 

ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ - అమర్ దీప్, శోభా శెట్టిని.. అర్జున్ - అమర్ దీప్, యావర్ ను నామినేట్ చేశారు. యావర్ వల్ల విడిపించుకో రాజా గేమ్ లో నష్టపోయానని చెప్పుకొచ్చారు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఎవరి వాదన వారు బిగ్ బాస్ కు వినిపించారు. నెక్ట్స్ ప్రియాంక అమర్ దీప్ ను నామినేట్ చేసింది. తనను హార్టింగ్ గా మాట్లాడాడని రీజన్ చెప్పించింది. ఆ తర్వాత  యావర్ ను నామినేట్ చేసింది. 

ఇక శివాజీ ప్రియాంకను నామినేట్ చేశారు. సేఫ్ గేమ్ రీజన్ చెప్పారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే అమర్ దీప్ ను కూడా నామినేట్ చేశారు. కానీ ఆ తర్వాత అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేయడంతో హౌజ్లో మాటల యుద్దం జరిగింది. ఒకరి మధ్య మరొకరితో వార్ జరిగింది. ఇదే సమయంలో అమర్ దీప్ అరేయ్ అంటూ పల్లవి ప్రశాంత్ ను అరేయ్ అంటూ వ్యాఖ్యానించడం, రైతుబిడ్డ వ్యతిరేకించడం... ఇలా వాదోపావాదనలతో ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చారు. ఈ క్రమంలో రైతు బిడ్డా చాలా ఎమోషనల్ అయ్యారు. అమర్ వల్ల తానే మోసపోయానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత అమర్ దీప్ యావర్ ను నామినేట్ చేసి రీజ్ చేశారు. ఆ తర్వాత హౌజ్ వాదనలతో హోరెత్తింది. ఈరోజుతో అమర్ దీప్ మూడు నామినేషన్లను పొందారు. మున్ముందు ఎవరికి ఎక్కువ నామినేషన్లు వారు హౌజ్ ను వీడాల్సి ఉంటుంది. 

click me!