
బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతుంది. 21 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయిన షో 10 వారాలు పూర్తి చేసుకుంది. ఈ పది వారాల్లో 11 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేటయ్యారు. షాని, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహిరావు, చలాకి చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాల ఆదిత్య, వాసంతి వరసగా ఎలిమినేట్ కావడం జరిగింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పేరుతో బాల ఆదిత్య, వాసంతిలను బయటకు పంపారు.
ఇక ఇంట్లో మిగిలిసిన రేవంత్, ఆదిరెడ్డి, రాజ్, ఫైమా, మెరీనా, రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, ఇనయాలను టాప్ టెన్ గా నాగార్జున ప్రకటించారు. వాళ్లకు కంగ్రాట్స్ చెప్పారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గెలుచుకోబోయే ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు. కంటెస్టెంట్స్ టైటిల్ కోసం మరింత పోరాడేలా మోటివేట్ చేశారు.
సోమవారం కావడంతో బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు. డస్ట్ బిన్స్ లో ఉన్న చెత్తను నెత్తిన పోసి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆదేశించారు. నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా హౌస్లో ఉన్న 9 మంది నామినేట్ అయినట్లు తెలుస్తుంది. ఫైమా కెప్టెన్ కావడంతో ఎలిమినేషన్ నుండి మినహాయింపు పొందింది. ఆమెను ఎవరూ నామినేట్ చేయకూడని బిగ్ బాస్ చెప్పారు.
ఇక టాప్ టెన్ కి చేరిన ఈ స్ట్రాంగ్ అండ్ టాప్ కంటెస్టెంట్స్ లో వచ్చే వారం ఎలిమినేట్ అయ్యేదెవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గీతూ, సూర్య రీఎంట్రీ ఇచ్చే ఆస్కారం కలదు అంటున్నారు. బిగ్ బాస్ షోకి ఎలాంటి రూల్స్ ఉండవు కాబట్టి ఏదైనా జరగొచ్చు. ఆటను ఆసక్తికరంగా మార్చేందుకు నాగార్జున ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు.