
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుంది. మిషన్ పాజిబుల్ టాస్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులను రెడ్ అండ్ బ్లూ టీమ్స్ గా విభజించారు. ఒక టీమ్ సభ్యులు మరొక టీమ్ లో ఉన్న సభ్యుల చంపాల్సి ఉంటుంది. ఒక సభ్యుడి భుజాలపై ఉన్న నాలుగు స్ట్రిప్స్ పీకేస్తే ఆ మెంబర్ చనిపోయినట్లు లెక్క. ఈ గేమ్ కోపాలకు, ఎమోషన్స్ కి దారి తీస్తుంది. మైండ్ గేమ్ కూడా ఆడొచ్చు, వీక్నెస్ లపై కొట్టొచ్చు అనే పాయింట్ ఆధారంగా రెడ్ టీమ్లో ఉన్న రేవంత్, గీతూ, శ్రీసత్య ఆడుతున్నారు.
ప్రత్యర్థి టీమ్ లో ఉన్న బాల ఆదిత్య సిగరెట్స్, లైటర్ దాచేసి మానసిక క్షోభకు గురి చేశాడు. సిగరెట్ లేకపోతే ఒత్తిడికి గురయ్యే బాల ఆదిత్య ఎంత బతిమిలాడినా సిగరెట్స్, లైటర్ గీతూ, శ్రీసత్య ఇవ్వలేదు. బాల ఆదిత్య చివరికి తీవ్రంగా ఏడ్చాడు. తాజాగా మరో ప్రత్యర్థి కంటెస్టెంట్ ఇనయా వీక్నెస్ పై దెబ్బ కొట్టారు. సూర్య ఎలిమినేటయ్యాక అతడి ప్లేట్ లో ఇనయా భోజనం చేస్తుంది. ఆ ప్లేట్ కనబడకుండా చేశారు. దీంతో ఎమోషనల్ అయిన ఇనయా నాకు భోజనం వద్దని ఇంట్లో ఒక మూలాన వెళ్లి కూర్చుంది.
ఇంటి సభ్యులు అన్నం తినాలని ఎంత బతిమిలాడినా తినలేదు. చివరకు మెరీనా సూర్య కోసం తినమని కోరడంతో భోజనం చేసింది. మరోవైపు ఎంత చెప్పినా రేవంత్ బూతులు తిట్టడం, కంటెస్టెంట్స్ ని కొట్టడం ఆపడం లేదు. భుజాలపై ఉన్న స్ట్రిప్స్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిన ఆదిరెడ్డి చేతులపై కొట్టాడు. ఆదిరెడ్డి కొట్టడం, గాయపరచడం గేమ్ కాదని చెప్పినా వినలేదు.కానీ గేమ్ లో రోహిత్ చేయితగిలిందని ''నీ యమ్మా'' అంటూ తిట్టాడు. మెరీనా కోపం వచ్చి అడిగితే నేను తిట్టలేదని అబద్ధం చెబుతున్నాడు. రేవంత్ తీరు హౌస్లో చాలా వివాదాస్పదంగా ఉంది.