Bigg Boss Telugu 6: ఆఖరి పోరాటం... కీలక సమయంలో ఆదిరెడ్డి ని చావు దెబ్బతీశారుగా!

Published : Dec 15, 2022, 04:12 PM IST
Bigg Boss Telugu 6: ఆఖరి పోరాటం... కీలక సమయంలో ఆదిరెడ్డి ని చావు దెబ్బతీశారుగా!

సారాంశం

కీలక సమయంలో ఇంటి సభ్యుల ఏకాభిప్రాయం ఆదిరెడ్డిని చావు దెబ్బ తీసింది. ఆడియన్స్ నుండి పెద్ద మొత్తంలో ఓట్లు పొందే ఛాన్స్ కోల్పోయాడు.   

బిగ్ బాస్ సీజన్ 6 కీలక సమయానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. డిసెంబర్ 18 ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రస్తుతం హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్ కి చేరుతారని, ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళతారని నాగార్జున తెలియజేశారు. శ్రీసత్య ఎలిమినేట్ కానుందనే ప్రచారం జరుగుతుంది. ఆరుగురిలో తక్కువ ఓట్లు వచ్చిన శ్రీసత్య ఎలిమినేట్ అయ్యారంటూ విశ్వసనీయ సమాచారం. ప్రతి ఎలిమినేషన్ ముందుగానే లీక్ అవుతున్న నేపథ్యంలో, శ్రీసత్య ఎలిమినేషన్ నిజమే కావచ్చు అంటున్నారు. 

కాగా కీలక సమయంలో ఏకాభిప్రాయం ఆదిరెడ్డిని దెబ్బతీసింది. ఆడియన్స్ ని నేరుగా ఓట్లు వేయమని కోరుకునే ఛాన్స్ ఒకరికి బిగ్ బాస్ ఇచ్చారు. ఇంట్లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో టాస్క్ గెలిచిన కంటెస్టెంట్ 'ఓట్ ఫర్ మీ' క్యాంపైన్ చేసుకోవచ్చు. దీని కోసం 'ఆఖరి పోరాటం' అనే టాస్క్ నిర్వహించారు. ఆఖరి పోరాటం టాస్క్ లో ఆదిరెడ్డి, రోహిత్ ఫైనల్ కి చేరారు. 

వీరిలో ఎవరికి ఆడియన్స్ ని ఓట్లు కోరుకునే ఛాన్స్ ఇవ్వాలో మిగిలిన నలుగురు సభ్యులు ఏకాభిప్రాయంతో నిర్ణయించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. రేవంత్ మాత్రమే ఆదిరెడ్డికి ఓటేశాడు. మిగిలిన శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి... రోహిత్ ని సప్పోర్ట్ చేశారు. మెజారిటీ సభ్యులు రోహిత్ ని ఎంచుకోవడంతో ఆదిరెడ్డి ఆడియన్స్ వద్ద ఓట్ల కోసం క్యాంపైన్ చేసుకునే ఛాన్స్ కోల్పోయాడు. రోహిత్ అవకాశం దక్కించుకున్నాడు. 

ఇక బిగ్ బాస్ విన్నర్ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈసారి బిగ్ బాస్ విన్నర్ భారీగా లబ్దిపొందనున్నారు. రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు రూ. 25 లక్షల విలువైన ఫ్లాట్, ఒక మారుతి సుజుకీ బ్రీజా కార్ సొంతం చేసుకోనున్నాడు. గత ఐదు సీజన్స్ నుండి అబ్బాయిలే విన్నర్ అవుతున్నారు. మరి సీజన్ 6 లో అయినా అమ్మాయికి అవకాశం వస్తుందేమో చూడాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే