బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలతో బిగ్ బాస్ సందడి షురూ అయ్యింది. అయితే ఈ సారి బిగ్ బాస్ కొత్తగా, కలర్ ఫుల్‌గా ఉంది. చాలా ప్రత్యేకతని చాటుకుంటుంది. అదే సమయంలో ప్రారంభంలోనే పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ కంటెస్టెంట్ బిగ్ బాస్ కే ఝలక్ ఇచ్చాడు.
11:47 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 షో గ్రాండ్ ఓపెనింగ్ ముగిసింది. ప్రారంభం రోజున మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వెళ్లారు. సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఔట్ హౌజ్‌లో, కామనర్స్ మెయిన్ హౌజ్‌లో ఉన్నారు. ఇక సోమవారం నుంచి అసలు రణరంగం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హౌజ్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్ల డిటెయిల్స్ తెలుసుకోండి.
10:13 PM (IST) Sep 07
బిగ్ బాస్ హౌజ్‌లోకి 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు, 6 కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరికి చివర్లో ట్విస్ట్ ఇచ్చారు నాగ్. ఈ సారి రెండు హౌజ్‌లు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో కామనర్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. సకల సౌకర్యాలున్న మెయిన్ హౌజ్‌లో కామనర్స్ ఉండాలని, ఎలాంటి సౌకర్యాలు లేని ఔట్ హౌజ్‌లో సెలబ్రిటీలు ఉండాలని తెలిపారు. వారిని టెనెంట్‌గా వర్ణించారు. అనంతరం రెండు హౌజ్‌లకు లాక్ వేశారు నాగ్. ఇలా గ్రాండ్‌గా బిగ్ బాస్ తెలుగు 9 ఓపెనింగ్ సెర్మనీ ముగిసింది.
10:07 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9లో వారం రోజులపాటు కుక్ చేసే బాధ్యత సంజనా గాల్రానీకి అప్పగించారు. ఆమె హౌజ్‌కి కుక్ చేయనున్నారు. అయితే తనకు వంట రాదని చెప్పడం విశేషం.
10:02 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి చివరి కంటెస్టెంట్‌గా కామనర్ మర్యాద మనీష్‌ని ఎంపిక చేశారు. మొదట ఐదుగురునే కామనర్‌గా ఎంపిక చేస్తామని తెలిపారు. కానీ చివర్లో శ్రీముఖి వచ్చి ట్విస్ట్ ఇచ్చింది. మరో కంటెస్టెంట్‌కి ఛాన్స్ ఇవ్వాలని కోరగా, నాగ్ ఓకే చెప్పారు. అలా మర్యాద మనీష్‌కి ఛాన్స్ దక్కింది. ఇలా మొత్తంగా 15 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభం పూర్తయ్యింది.
09:55 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9లో చివరి నిమిషంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. షో క్లోజ్ చేసే సమయంలో యాంకర్ శ్రీముఖి స్టేజ్‌పైకి వచ్చింది. మరో కామనర్‌కి ఛాన్స్ ఇవ్వాలని కోరింది. అంటే ఆరో కామనర్‌కి ఛాన్స్ ని కల్పించారు. శ్రీముఖి కోరిక మేరకు నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిజీత్, శ్రీముఖిల రిక్వెస్ట్ మేరకు మరో కామనర్‌కి ఛాన్స్ ఇచ్చారు.
09:51 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి ఐదో కామనర్‌గా ప్రియా ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు చివరి కంటెస్టెంట్ తనే అని నాగార్జున తెలిపారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నా కూడా వాటిని పక్కన పెట్టి హౌజ్‌లోకి వచ్చినట్టు తెలిపారు ప్రియా. అదే సమయంలో తాను సింగిల్ అని తెలిపింది ప్రియా.
09:48 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9లోకి 13వ కంటెస్టెంట్‌గా కమెడియన్ సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు. తాను ఇన్నాళ్లు మిస్ అయిన విషయాన్ని పంచుకున్నారు. ఇతర భాషల్లో సినిమాలు చేయడం వల్ల తెలుగులో చేయలేకపోయానని, ఇకపై కనిపిస్తానని తెలిపారు సుమన్ శెట్టి.
09:30 PM (IST) Sep 07
నాల్గో కామనర్‌గా దమ్ము శ్రీజ ఎంపికయ్యింది. ఆమె 12వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె గురించి, ఆమె యాక్టివ్‌నెస్ గురించి నవదీప్ తెలిపారు. ఇరిటేటింగ్‌గా అనిపించిందని, ఆ తర్వాత తమని కూడా ఆడుకుందని తెలిపారు.
09:28 PM (IST) Sep 07
నాల్గో కామనర్‌ని ఎంపిక చేసేందుకు స్టేజ్‌పైకి అగ్నిపరీక్ష జడ్జ్ నవదీప్ స్టేజ్‌పైకి వచ్చారు. ఆయన నాల్గో కామనర్‌ని ఎంపిక చేశారు.
09:17 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి పదకొండవ కంటెస్టెంట్‌గా ఫోక్ డాన్సర్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు. తాను `రాను బొంబయికి రాను` పాటతోనే ఆయన ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇదే పాటతో ఆయన పాపులర్ అయిన విషయం తెలిసిందే.
09:05 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి పదో కంటెస్టెంట్‌గా నటి సంజనా గాల్రానీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన ఏవీలో కేసు గురించి చెప్పింది. తాను ఎంతగా సఫర్ అయ్యిందో వెళ్లిందో తెలిపింది. చిన్న స్థాయి నుంచి వచ్చానని, కానీ కేసు వల్ల తాను చాలా డౌన్ అయినట్టు తెలిపింది. కెరీర్ చాలా ఎఫెక్ట్ అయ్యిందని చెప్పింది.
09:02 PM (IST) Sep 07
కామనర్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన డీమాన్ పవన్.. అంట్లు తొమే బాధ్యత ఎవరికి ఇస్తారని నాగార్జున అడిగితే రీతూ చౌదరీకి అని చెప్పాడు. దీంతో ఆమె షాక్ అయ్యింది.
08:59 PM (IST) Sep 07
కామనర్ కేటగిరిలో మూడో కంటెస్టెంట్‌గా డీమాన్ పవన్ ఎంపికయ్యారు. ఆయన తొమ్మిదో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తనకు జపనీస్ నావెల్స్ అంటే ఇష్టమట. అందుకే ఆ పేరు పెట్టుకున్నట్టు తెలిపారు.
08:57 PM (IST) Sep 07
తాను తెచ్చుకున్న వస్తువు కారణంగా నటుడు భరణినీ బిగ్ బాస్ రిజెక్ట్ చేశాడు. దీంతో తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిగ్ బాస్ పెద్ద మనసు చేసుకుని ఆయనకు అవకాశం కల్పించారు. అయితే తాను తీసుకెళ్లేది ఒక లాకెట్ మాత్రమే అని చూపించారు. దాని కథేంటో హౌజ్‌లోకి వెళ్లాక భరణి చెబుతాడని నాగార్జున చెప్పడం విశేషం.
08:55 PM (IST) Sep 07
సోషల్ మీడియా సెన్సేషన్, టీవీ, సినిమా నటి రీతూ చౌదరీ బిగ్ బాస్ తెలుగు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎనిమిదో కంటెస్టెంట్‌గా రావడం విశేషం. తనదైన డాన్స్ పర్‌ఫెర్మెన్స్ తో అలరించింది. హౌజ్‌లోకి వెళ్లాక తన నోటి దూల తగ్గించుకుంటానని తెలిపింది.
08:36 PM (IST) Sep 07
ఏడో కంటెస్టెంట్‌గా సినిమా, టీవీ నటుడు భరణి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ కే పెద్ద షాక్ ఇచ్చాడు. తాను ఒక ఐటెమ్ తీసుకొని వచ్చాడు. అది తీసుకొని హౌజ్‌లోకి వెళ్తానని చెప్పాడు. అది తనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. స్టేజ్ మీద రివీల్ చేయాలని కోరగా, నో చెప్పాడు భరణి. బిగ్ బాస్ ఒప్పుకోలేదు. దీంతో హౌజ్‌లోకి వెళ్లకుండా తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఇందులో ఏదైనా ట్విస్ట్ ఉందా? అనేది తెలియాల్సి ఉంది.
08:31 PM (IST) Sep 07
ఆరో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కామనర్ మాస్క్ మ్యాన్ హరీష్.. కంటెస్టెంట్లకి టాస్క్ ఇచ్చారు. వారం రోజులపాటు హౌజ్‌ని క్లీన్ చేసే బాధ్యతలు అప్పగించారు.
08:25 PM (IST) Sep 07
రెండో కామనర్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మాస్క్ మ్యాన్ హరీష్. ఆయనకు ఒక కండీషన్ పెట్టారు బిగ్ బాస్. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు ఆయన గుండుతోనే ఉండాల్సి ఉంటుంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇతర కంటెస్టెంట్ల మాస్క్ తీసే పనిలో ఉంటానని చెప్పాడు.
08:23 PM (IST) Sep 07
రెండో కామనర్‌ని కంటెస్టెంట్‌గా ఎంపిక చేసేందుకు అగ్నిపరీక్ష జడ్జ్ బిందుమాధవి షోలోకి వచ్చారు. ఆమె రెండో కామనర్ మాస్క్ మ్యాన్ హరీష్‌ని ఎంపిక చేసింది. ఆయన విషయంలో తాను రాంగ్ జడ్జ్ మెంట్ చేసినట్టు తెలిపింది.
08:13 PM (IST) Sep 07
కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ అమ్మాయిలకు సందేశం ఇచ్చింది. ఏదైనా సందర్భంగా, సంఘటనలు వచ్చినప్పుడు అమ్మాయిలు స్ట్రాంగ్ అవుతారని చెప్పింది. ఏదైనా చెప్పాల్సి వస్తే నిర్మొహమాటంగా చెప్పాలని తెలిపింది. సోషల్ మీడియాలో కామెంట్స్ పట్టించుకోవద్దు అని తెలిపింది. వాటిని పట్టించుకుంటే చాలా ఎఫెక్ట్ అవుతామని తెలిపింది.
08:09 PM (IST) Sep 07
కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. కింగ్‌డమ్ చిత్రంలోని పాటతో ఆమె డాన్స్ చేసి మెప్పించింది.
08:03 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి నాల్గో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యయెల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఏవీ ఆద్యంతం ఆకట్టుకుంది. కామెడీగా ఉంది. ఆ తర్వాత స్టేజ్‌మీద పాట పాడి అలరించారు. ఇందులో అమ్మాయి వాయిస్‌లో పాట పాడి నాగ్‌ని ఇంప్రెస్ చేశారు.
07:50 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి మొదటి కామనర్‌గా కళ్యాణ్ ఎంపికయ్యారు. ఈ సారి హౌజ్‌లోకి వెళ్లాక రణరంగమే అని తెలిపారు కళ్యాణ్. ఇందులోకి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని, ఫైనల్‌గా సాధించామని తెలిపారు.
07:43 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి రెండో కంటెస్టెంట్‌గా ఫ్లోరా సైనీ(ఆషా సైనీ) ఎంట్రీ ఇచ్చింది. తన పేరు వెనుక కథ చెప్పింది. అసలు పేరు ఫ్లోరా సైనీ, అయితే తన మొదటి సినిమా సమయంలో దర్శకుడు తనకు తెలియకుండా పేరు మార్చారట. కానీ అది నచ్చలేదని తెలిపింది. తాను బ్యూటీ కాంటెస్ట్ పాల్గొన్నదట. `ప్రేమ కోసం` తన తొలి సినిమా అని చెప్పిందట ఫ్లోరా సైనీ.
07:28 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి మొదటి కంటెస్టెంట్ గా తనూజ ఎంట్రీ ఇచ్చారు. అదిరిపోయే డాన్స్ పర్‌ఫెర్మెన్స్ తో ఆమె ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆమె తనదైన డైలాగ్‌లతో అదరగొట్టింది. వస్తూ వస్తూ నాగ్ కోసం సర్‌ప్రైజ్ తెచ్చింది. మటన్ బిర్యానీ తీసుకొచ్చింది.
07:17 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి ఆరుగురు కామనర్స్ కంటెస్టెంట్లుగా వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఐదుగురునే ఎంపిక చేయబోతున్నట్టు నాగార్జున తెలిపారు. మరి ఆ ఐదుగురు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
07:12 PM (IST) Sep 07
ఈ సారి బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో కెప్టెన్‌కి సెపరేట్‌గా రూమ్‌ని డిజైన్ చేశారు. అది చాలా రాయల్‌గా ఉంది. అంతేకాదు కొన్ని మ్యాజిక్ లు, మాయలు ఉన్నాయి. అవన్నీ నాగార్జున చూపించారు. అయితే చూపించే ప్రతి రూమ్‌ని ఒక పరీక్ష పెట్టాక చూపించడం విశేషం.
07:07 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి నాగార్జున వెళ్లారు. అయితే లోపలికి వెళ్లిన హోస్ట్ నాగార్జునకే పరీక్ష పెట్టారు ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌ని చూపించారు. బట్టర్ ఫ్లై లుక్‌లో డిజైన్ చేశారు.
07:03 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. సోనియా సోనియా అంటూ నాగ్ అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో హౌజ్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి.
06:13 PM (IST) Sep 07
ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో రెండు హౌజ్ ఉంటాయని నాగార్జున తెలిపారు. అయితే ఆ రెండు కామనర్స్ కి ఒకటి, సెలబ్రిటీలకు మరోటి ఉండబోతుందని సమాచారం. వీరి మధ్య ఫైట్ ఉంటుందని సమాచారం. వీరిని రెండు టీములుగా విడగొట్టి గేమ్ ఆడించబోతున్నాడట బిగ్ బాస్.
06:12 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 లోకి కామనర్స్ కూడా కంటెస్టెంట్లుగా వస్తోన్న విషయం తెలిసిందే. దానికోసం ఏకంగా అగ్నిపరీక్ష పేరుతో స్పెషల్ షోనే నిర్వహించారు. అయితే ఈ సారి ఆరుగురు కంటెస్టెంట్లు కంటెస్టెంట్లుగా ఎంపికైనట్టు సమాచారం. వారిని బిగ్ బాస్ గ్రాండ్ లాంచింగ్ సమయంలో ప్రకటించబోతున్నారు. జడ్జ్ లు గా వ్యవహరించిన నవదీప్, బిందు మాధవి, అబిజీత్ వారి పేర్లని ప్రకటిస్తారు. అయితే షో ప్రారంభంలోనే ఈ ప్రకటన ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రోమోని ఇక్కడ చూడండి.
06:07 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్‌కి సంబంధించి మార్నింగ్ ప్రోమో వచ్చింది. ఇందులో బిగ్ బాస్ హౌజ్‌ని పరిచయం చేశారు. రెండు హౌజ్‌లు ఉండబోతున్నట్టు తెలిపారు. కంటెస్టెంట్లని పరిచయం చేశారు. కామనర్స్ తో మాట్లాడారు. అదే సమయంలో ఓ కంటెస్టెంట్ ప్రారంభం రోజే వెళ్లిపోవడం చూపించారు.
06:04 PM (IST) Sep 07
బిగ్ బాస్ తెలుగు 9 కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చే కంటెస్టెంట్ల పారితోషికాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. వారి రేంజ్‌ని బట్టి పారితోషికాలుంటాయి. అవేంటో ఇందులో తెలుసుకోండి.