ప్రియ, రవి గేమ్ లో బలైన లహరి... చివరికి ఇంటికి!

Published : Sep 26, 2021, 10:17 PM IST
ప్రియ, రవి గేమ్ లో బలైన లహరి... చివరికి ఇంటికి!

సారాంశం

ఈ టాస్క్ లో ప్రియ పేరున్న లైట్ గ్రీన్ కావడంతో ఆమె సేవ్ అయ్యారు. లహరి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. దీనికి యాంకర్ రవి చాలా ఫీల్ అయ్యారు. లహరి మాత్రం నీ తప్పులేదని అతన్ని హాగ్ చేసుకోవడం విశేషం.

మూడవ ఆదివారం అంటే మూడవ ఎలిమినేషన్. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 17మంది సభ్యులు ఉన్నారు. సరయు, ఉమాదేవి ఎలిమినేషన్స్ తరువాత మూడవ ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్లనున్నారని ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఐదుగురు సభ్యులు ఉండగా ప్రియాంక సింగ్, శ్రీరామ్ నిన్న సేవ్ అయ్యారు. మానస్ కూడా నేడు సేవ్ కాగా, చివరికి ఇద్దరు మిగిలారు. 

ప్రియ, లహరి ఇద్దరిలో ఒకరు హౌస్ ను వీడనున్నారు. హోస్ట్ నాగార్జున.. రెండు లైట్స్ తీసుకు వచ్చారు. ఒక లైట్ పై ప్రియ పేరు, మరొక లైట్ పై లహరి పేరు రాసి ఉంది. ఎవరు పేరు రాసి ఉన్న లైట్ రెడ్ నుండి గ్రీన్ గా మారుతుందో, వారు సేవ్ అయినట్లు, మిగతా వారు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలిపారు. 

ఈ టాస్క్ లో ప్రియ పేరున్న లైట్ గ్రీన్ కావడంతో ఆమె సేవ్ అయ్యారు. లహరి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. దీనికి యాంకర్ రవి చాలా ఫీల్ అయ్యారు. లహరి మాత్రం నీ తప్పులేదని అతన్ని హాగ్ చేసుకోవడం విశేషం. అయితే చాలా త్వరగా ఎలిమినేట్ అయినందుకు ఫీల్ అయిన భావన ఆమెలో కనిపించింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న లహరి మూడవ వారంలోనే నిష్క్రమించడం సంచలనమే. 

యాంకర్ కావాలనే ఆలోచనతో సింగిల్ మెన్ చాలా మంది ఉన్నా, లహరి నా వెంటపడుతుంది, అని రవి చెప్పడం జరిగింది. ఈ వివాదంలో రవి, లహరి మధ్య ఏం జరిగిందో పక్కన పెడితే, ప్రియ కామెంట్స్ సంచలనం రేపాయి. ఈ గొడవ సంచలనంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్