బిగ్ బాస్ 5: హోస్ట్ గా చేయనంటున్న రానా?

By team teluguFirst Published Jul 9, 2021, 7:53 AM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 5 కోసం నిర్వహకులు సిద్ధం అవుతున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియతో పాటు హోస్ట్ ని ఎంపిక చేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నారు.

మరో రెండు నెలల్లో బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా లాంచ్ కానుంది. సెప్టెంబర్ మొదటివారం నుండి బిగ్ బాస్ షో ప్రారంభం కానుందని తెలుస్తుండగా, కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభించారట. ఈసారి హౌస్ లోకి వెళ్లనున్నారంటూ కొన్ని క్రేజీ నేమ్స్ వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా కొందరు సెలెబ్రిటీ పేర్లు ప్రచారం అవుతున్నాయి. 


ఇక బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా ఎవరు అనే విషయంపై కూడా పెద్ద చర్చే నడుస్తుంది. కింగ్ నాగార్జున సీజన్ 3,4 లను సక్సెస్ ఫుల్ గా నడిపించారు. చక్కని వాక్ చాతుర్యం, హోస్టింగ్ స్కిల్స్ తో నాగార్జున బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ తీసుకువచ్చారు. దీనితో సీజన్ 5కి నాగార్జుననే హోస్ట్ గా నిర్వాహకులు భావించారు. అయితే అనూహ్యంగా నాగార్జున తప్పుకున్నట్లు తెలుస్తుంది. 


బుల్లితెరపై హోస్ట్ గా అనుభం ఉన్న రానా బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ హోస్ట్ గా చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. రానాతో నిర్వాహకులు చర్చలు కూడా జరిపారట. అయితే రానా సైతం బిగ్ బాస్ హోస్ట్ గా చేయనని చెప్పారని సమాచారం. సినిమా కమిట్మెంట్స్ నేపథ్యంలో భారీగా పారితోషికం ఆఫర్ చేసినా, చేయలేనని చెప్పారట. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 


మరి నాగార్జున, రానా చేయని పక్షంలో టాలీవుడ్ నుండి మరో ఆప్షన్ ఎవరు కానున్నారో చూడాలి. మొదటి సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీఆర్ జెమినీ ఛానెల్ కోసం ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం కి కమిట్ అయ్యారు. ఆ షో త్వరలో ప్రసారం కానుంది. దీనితో ఎన్టీఆర్ మరలా బిగ్ బాస్ హోస్ట్ గా కనిపించే దాఖలాలు లేవు. 
 

click me!