మార్కెట్ లేదని బేబీ మూవీలో ఛాన్స్ ఇవ్వలేదు... అర్జున్ కళ్యాణ్ ఆవేదన!

Published : Aug 30, 2023, 07:48 PM IST
మార్కెట్ లేదని బేబీ మూవీలో ఛాన్స్ ఇవ్వలేదు... అర్జున్ కళ్యాణ్ ఆవేదన!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ లో ఒకరైన అర్జున్ కళ్యాణ్ బేబీ మూవీలో ఛాన్స్ కోల్పోయినందుకు ఆవేదన చెందాడు. అవకాశాలు ఇవ్వకుండా మార్కెట్ ఎలా పెరుగుతుందని వాపోయాడు.   

నటుడు అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 6తో ఫేమస్ అయ్యాడు. కంటెస్టెంట్ శ్రీసత్యను పిచ్చిగా ప్రేమించాడు. దాంతో గేమ్ మీద ఫోకస్ తగ్గి త్వరగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే జనాల మందిలో రిజిస్టర్ అయ్యాడు. ప్రస్తుతం అడపాదడపా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అయితే అతడికి బేబీ మూవీలో ఛాన్స్ తృటిలో చేజారిందట. ఆ ప్రాజెక్ట్ లో అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా అవకాశం దక్కలేదని అన్నాడు . మూవీ పేరు చెప్పకుండా పరోక్షంగా ఈ విషయాన్ని తెలియజేశాడు. 

అర్జున్ మాట్లాడుతూ... ఇటీవల ఓ కల్ట్ క్లాసిక్ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ ప్రాజెక్ట్ లో సెకండ్ హీరోగా నేను నటించాల్సింది. హీరోయిన్ నా ఫ్రెండ్ కావడంతో నా పేరు రిఫర్ చేసింది. దర్శకుడు కూడా మిత్రుడే. దాంతో నాకు ఛాన్స్ ఖాయం అనుకున్నాను. అయితే ఇది నాలుగు కోట్ల ప్రాజెక్ట్. కొంచెం మార్కెట్ ఉన్న హీరో కావాలి. అందుకే వేరే హీరోని అనుకుంటున్నాం అన్నాడు. నేను నిరాశకు గురయ్యాను. 

మార్కెట్ లేకుండా గుర్తింపు రాదు. అందుకే బిగ్ బాస్ షోకి వెళ్ళాను. కానీ అవకాశాలు ఇవ్వకుండా మార్కెట్ ఎలా క్రియేట్ అవుతుంది. చిత్రాల్లో నటిస్తే కదా జనాల్లో గుర్తింపు వచ్చేదని అర్జున్ కళ్యాణ్ ఆవేదన చెందాడు. సున్నిత మనస్కుడైన అర్జున్ కళ్యాణ్ ని బిగ్ బాస్ హౌస్లో శ్రీసత్య వీక్నెస్ తో ఆడుకుందనే వాదన ఉంది. ఆమె చుట్టూ తిరుగుతూ గేమ్ వదిలేసిన అర్జున్ కళ్యాణ్ త్వరగా ఎలిమినేట్ అయ్యాడు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ