ఖరీదైన బెంజ్ కారు బర్త్ డే గిఫ్ట్ గా కొట్టేసిన అషురెడ్డి.. ఇంతకీ ఎవరిచ్చారో తెలుసా?

By Sambi ReddyFirst Published Sep 15, 2022, 2:46 PM IST
Highlights

హాట్ బ్యూటీ అషురెడ్డి బర్త్ డే నేడు. బర్త్ డే గిఫ్ట్ గా ఖరీదైన లగ్జరీ కార్ పట్టేసింది. ఇంతకీ అంత ఖరీదైన కారు అషురెడ్డికి ఎవరిచ్చారో తెలుసా... 
 

సెప్టెంబర్ 15 అషురెడ్డి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్స్, ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే ఈ బర్త్ డేకు ఆమెకు ఖరీదైన బహుమతి దక్కింది. మెర్సిడెజ్ బెంజ్ కోప్ ని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ మోడల్ ధర రూ. 72 లక్షలకు పైగా ఉంది. ఇకపై అషురెడ్డి లగ్జరీ కారులో చక్కర్లు కొట్టనుంది. ఆ వైట్ లగ్జరీ కార్ పక్కన స్టైలిష్ ఫోజులిస్తూ అషురెడ్డి నిల్చుంది. 

ఆ ఖరీదైన గిఫ్ట్ అషురెడ్డికి వాళ్ళ నాన్న ఇచ్చారు. ఆ విషయాన్ని అషురెడ్డి స్వయంగా తెలియజేసింది. ఇంస్టాగ్రామ్ లో తన కొత్త కారు ఫోటోలు అషురెడ్డి పోస్ట్ చేశారు. ఆ ఫొటోల్లో అషురెడ్డి ఫాదర్ కూడా ఉన్నారు. అషురెడ్డి బెంజ్ కారు కొనడంపై నెటిజెన్స్ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక బుల్లితెర షోస్ లో అషురెడ్డి సందడి చేస్తున్నారు. అదే ఆమె కెరీర్ గా ఉంది. బిగ్ బాస్ సీజన్ 3 లో అషురెడ్డి పాల్గొన్నారు. హౌస్ లో గ్లామర్ తో రెచ్చిపోయినా కానీ మైలేజ్ రాలేదు. ఆమె కొద్దివారాలకే చాప చుట్టేసింది. అలాగే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అషురెడ్డి పాల్గొన్నారు. అక్కడ కూడా ఆమెకు కలిసి రాలేదు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. అషురెడ్డి గ్లామరస్ ఫోటోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే అషురెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఎంత ప్రయత్నం చేసినా ఆమెకు కోరుకున్న గుర్తింపు రావడం లేదు. కనీసం ఒక యాంకర్ గా కూడా ఎదగలేకపోతున్నారు. 

click me!