బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి తనకు కాబోయే భర్త గురించి చెప్పేందుకు ఓ ఫన్నీ రీల్ ను చేసింది. ఈ క్రమంలో వాళ్ల రియాక్షన్ ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ ఆకట్టుకుంటోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులతో అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అషురెడ్డి ఓ ఫన్నీ వీడియోను అభిమానులతో పంచుకుంది. దానిపై వాళ్ల అమ్మ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది.
ఆ వీడియోలో తనకు కాబోయే భర్త ఇలా ఉండాలంటూ ఓ వైరల్ వీడియోకు లిప్ సింక్ చేస్తూ రీల్ చేసింది. ఇంట్లో పనిచేయాలంటూ, తను అలిగినప్పుడు బదిమాలాడాలని రీల్ ద్వారా చెప్పుకొచ్చింది. అయితే ఆ వాయిస్ కూడా అషురెడ్డికి బాగా సింగ్ అయ్యింది. ఆ రీల్ చేసే సమయంలో అషు వాళ్ల తల్లి విని షాకింగ్ గా రియాక్ట్ అయ్యింది. చీపురుతో అషురెడ్డిని రెండు దెబ్బలేసింది.
undefined
తల్లి చేతిలో దెబ్బలు తిన్నా కూడా ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది అషురెడ్డి. ‘ఆ వాయిస్ నాదేనని భావిస్తోంది’ అంటూ తల్లిని ఉద్దేశించి క్యాప్షన్ ఇచ్చింది. ఏదేమైనా అషురెడ్డి చేసిన ఆ రీల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు కూడా అషు ఫన్నీ వీడియోపై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ తో వైరల్ గా మారుస్తున్నారు.
ఇక అషురెడ్డి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో రెండు సార్లు ఎంట్రీ ఇచ్చింది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక మరింత క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే ‘ఫోకస్’ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా అలరించింది. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’ అనే చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతోంది.