హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ!

Published : Apr 13, 2019, 10:25 AM IST
హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా పాల్గొన్న భానుశ్రీ మంచి గుర్తింపే తెచ్చుకుంది. 

బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా పాల్గొన్న భానుశ్రీ మంచి గుర్తింపే తెచ్చుకుంది. నటిగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ బ్యూటీకి సరైన గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ షోతో కాస్త పాపులర్ అవ్వడంతో ఇప్పుడు ఈమెకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.

యువనటుడు జై హీరోగా నటిస్తోన్న 'బ్రేకింగ్ న్యూస్'లో భానుశ్రీకి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఆండ్రూ పాండియన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను భానుశ్రీ అభిమానులతో పంచుకుంది.

ఈ సినిమాలో ఆమె జైకి ప్రేయసిగా కనిపించనుంది. అతడి అమాయకత్వం చూసి ప్రేమలో పడే అమ్మాయిగా భానుశ్రీ పాత్ర ఉండబోతుంది. పెళ్లికి ముందు చలాకీగా ఉండే అమ్మాయిగా, పెళ్లి తరువాత సంప్రదాయబద్ధంగా కనిపించే యువతిగా మారిపోతానని చెప్పింది.

హీరో జైకి స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారని, సహ నటీనటులకు ఎంతగానో సహకారం అందిస్తారని చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా పదిహేను రోజుల షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ చెన్నైలో జరగనుంది.  

PREV
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ